Rangabali Movie Review : రంగబలి మూవీ రివ్యూ.. నాగశౌర్య హిట్ కొట్టాడా..?
NQ Staff - July 7, 2023 / 09:10 AM IST

Rangabali Movie Review :
నాగశౌర్య ఈ నడుమ యాక్షన్ డ్రామా సినిమాలకు పోకుండా రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటివి ఆయనకు బాగానే కలిసివస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మరోసారి తనకు కలిసి వచ్చిన పంథాలో రంగబలి మూవీ చేస్తున్నాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా చేస్తోంది. సత్య, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, గోపరాజు రమణ, అనంత్ శ్రీరామ్, శుభలేఖ సుధాకర్, నోయల్, శరత్ కుమార్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
శౌర్య అనే యువకుడు రాజవరంలో నివసిస్తూ ఉంటాడు. ఆయనకు వైజాగ్ డాక్టర్ సహజతో ప్రేమ పుడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ హీరోయిన్ తండ్రి(మురళీ శర్మ) వారి పెళ్లికి ఒప్పుకోడు. అసలు మురళి ఎందుకు ఒప్పుకోడు, శౌర్య జీవితం రాజవరం పట్టణంలోని రంగబలి సెంటర్ తో ఎలా పెనవేసుకుపోయింది, ఆ సమస్యను అతను ఎలా అధిగమిస్తాడు, మురళిని పెళ్లికి ఎలా ఒప్పిస్తాడు అనేది మిగతా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్..

Rangabali Movie Review
ఎప్పటిలాగానే ఇందులో కూడా ఎనర్జిటిక్ యువకుడి పాత్రలో నాగశౌర్య బాగానే నటించాడు. ఆయన పాత్ర చూడచక్కగా ఉంటుంది. భావోద్వేగాలు పలికించే సమయంలో, కామెడీ సీన్లలో నాగశౌర్య ఆద్యంతం నవ్వించాడనే చెప్పుకోవాలి. ఇక ఆయన ప్రేయసి పాత్రలో యుక్తి కూడా బాగానే చేసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో సత్య అదరగొట్టేశాడు. ఆయన కామెడీ ఈ సినిమాకు అత్యంత ప్లస్ పాయింట్. ఆయన లేకపోతే ఈ సినిమాకు ఫన్ వచ్చేది కాదేమో. మురళీశర్మ, శుభలేక సుధాకర్, షైన్ టామ్, గోపరాజు, శరత్ కుమార్ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
దర్శకుడు పవన్ కథను చక్కగానే రాసుకున్నాడు. కానీ ఇప్పటి జనరేషన్ కు కావాల్సింది మిస్ చేశాడు. అసలు కథలో ఏముందో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన విఫలం అయ్యాడు. చాలా సీన్లు అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు. ఓవరాల్ గా క్లైమాక్స్ కు ట్రాక్ కోల్పోయాడు, క్లైమాక్స్ రైటింగ్ పేలవంగా ఉంది. పవన్ సిహెచ్ అందించిన పాటలు చాలా వీక్ గా ఉన్నాయి. ఎక్కడా ఆకట్టుకోలేకపోయాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది. అనసవర సీన్లు చాలానే ఉన్నాయి. వంశీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్లు..

Rangabali Movie Review
నాగశౌర్య నటన, హీరోయిన్ గ్లామర్
కామెడీ సీన్లు
మైనస్ పాయింట్లు..
పేలవంగా ఉన్న సెకండ్ హాఫ్
ఆకట్టుకోని సంగీతం
కంటెంట్ లేని సీన్లు
చివరగా..
రంగబలి కథలో దమ్ము ఉన్నా.. అది మనకు తెరమీద చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్, మ్యూజిక్ మీద ఆయన ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే కచ్చితంగా మూవీ హిట్ అయ్యేది. కేవలం నాగశౌర్య కోసం వెళ్లాలి అనుకుంటేనే సినిమా చూడగలరు.