Prince Movie Review : ‘ప్రిన్స్’ రివ్యూ : విసిగించే సాగతీత.!
NQ Staff - October 21, 2022 / 12:23 PM IST

Prince Movie Review : తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్, అక్కడ స్టార్ హీరోగా దూసుకెళుతున్నాడు. శివ కార్తికేయన్ సినిమాలకి తెలుగు నాట కూడా ఓ మోస్తరు మార్కెట్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోనూ శివ కార్తికేయన్ తాజా సినిమా ‘ప్రిన్స్’ మీద ఆసక్తి బాగానే నెలకొంది. సినిమా ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. ఇంతకీ, శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ ఎలా వుంది.? అసలు కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.
కథేంటంటే..
పాఠాల మీద అస్సలేమాత్రం దృష్టిలేని విద్యార్థి, టీచరమ్మ మీద మనసు పారేసుకుంటాడు. అలా ఆమె కోసం ఇష్టం లేని చదువు మీద దష్టిపెడతాడు. తండ్రి తన ప్రేమను అంగీకరిస్తాడనే గట్టి నమ్మకంతో వుంటాడు ఆ కుర్రాడు. కానీ, ఓ బలమైన కారణంతో ఆ పెళ్ళిని వద్దంటాడు తండ్రి. ఆ కారణమేంటి.? ఆ కుర్రాడి ప్రేమ ఏమయ్యింది.? ఊరి కోసం కొడుకుని వదులుకోవడానికి తండ్రి ఎందుకు సిద్ధమవుతాడు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపై దొరుకుతుంది.
నటీనటుల పనితీరు..
శివ కార్తికేయన్ ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ సినిమాలోనూ తన పాత్రలో జీవించేశాడు. శివ కార్తికేయన్‌కి తోడు ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు.
హీరోయిన్ మారియా తెరపై అందంగా కనిపించింది. అయితే, పెద్దగా నటించేందుకు ఆమెకు సరైన అవకాశం దక్కలేదు. మిగతా పాత్రలేవీ పెద్దగా రిజిస్టర్ కావు.
సాంకేతిక వర్గం..
రెండు పాటలు వినడానికే కాదు, తెరపై చూడటానికీ చాలా బావున్నాయి. సినిమాకి అవసరమైన స్థాయిలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ప్రతి ఫ్రేమ్‌నీ అందంగా చూపించేందుకు తనవంతుగా కృషి చేశాడు.
ప్లస్ పాయింట్స్
శివ కార్తికేయన్ నటన
సినిమాటోగ్రఫీ
క్లయిమాక్స్

Prince Movie Review
మైనస్ పాయింట్స్..
కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం
స్క్రీన్ ప్లే అన్ ఈవెన్‌గా వుండడం..
విశ్లేషణ:

Prince Movie Review
కథ, కథనాలు సిల్లీగా అనిపిస్తాయ్. మెసేజ్ చెప్పే ప్రయత్నంలో అనవసరపు సన్నివేశాలతో బోర్ కొట్టించేశారు. కామెడీ ఇంకాస్త బెటర్‌గా వుండి వుంటే, కథనంలో లోపాలు లేకుండా చూసుకోగలిగి వుంటే ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేసేదే. కానీ, సాగతీతతో కూడిన సన్నివేశాలు సగటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్సిస్తాయి. శివకార్తికేయన్ అభిమానుల వరకూ ఓ సారి చూడొచ్చనిపించేలా వుందీ సినిమా.
రేటింగ్ 2/5