Lust Stories 2 Movie Review : లస్ట్ స్టోరీస్-2 రివ్యూ..!

NQ Staff - June 30, 2023 / 09:18 AM IST

Lust Stories 2 Movie Review  : లస్ట్ స్టోరీస్-2 రివ్యూ..!

Lust Stories 2 Movie Review  :

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కు మన దేశంలో మంచి క్రేజ్ ఉంది. మొదటి సీజన్ లో కియారా అద్వానీ ఎంత బోల్డ్ గా నటించిందో మనం చూశాం. అన్ని భాషల్లో మొదటి సీజన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక రెండో సీజన్ లో తమన్నా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఆమెతో పాటు విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి హీరోయిన్స్ నటించారు. ఈ సారి కూడా బోల్డ్ కంటెంట్ తోనే వస్తోంది ఈ సిరీస్. జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ…

ఈ సినిమా నలుగురి కథలతో కూడి ఉంటుంది. మొదటి కథలో సెక్స్ అంటే సిగ్గుపడే జంటకు దాని పరమార్థాన్ని ఓ బామ్మ వివరిస్తుంది. తన మనవళ్లకు కూడా విలువైన మాటలు చెబుతుంది. ఇక రెండో కథలో పెళ్లి అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకునే యువతి కథ. ఇది కొంచెం వల్గర్ గా ఉంటుంది. మూడోది యజమానితో పనిమనిషి అక్రమ సంబంధం పెట్టుకునేది. నాలుగో దాంట్లో ఒక స్త్రీ తన భర్త కామవాంచతో విసిగిపోతుంది. అలాగే ప్రయోజకుడు అవుతాడన్న కొడుకు నిరాశ పరుస్తాడు. ఇలా భర్త, కొడుకు మధ్య నలిగే పాత్ర ఆమెది. ఇలా నాలుగు కథలను విభిన్నంగా చూపించారు. లస్ట్ స్టోరీస్ సీజన్-1 కంటే ఇంకాస్త బోల్డ్ గా ఉంటుంది ఈ సీజన్ 2.

ఎవరెలా చేశారంటే..

ఇందులో ఎక్కువగా చెప్పుకోవాల్సింది నీనా గుప్తా పాత్ర గురించి. ఆమె తన మనవరాలికి, మనవడికి సెక్స్ గురించి చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. సెక్స్ లేకపోతే ప్రేమలేదు అంటూ ఆమె చెప్పే విధానంలో బాగా నటించి మెప్పించింది. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులు మెచ్చేలానటించడం అంటే మాటలు కాదు. ఇందులో నీనాను మెచ్చుకోవాల్సిందే. ఇక అన్యాయానికి గురైన దేవయాని పాత్రలో కాజల్ అదరగొట్టేసింది. మిగతా సెగ్మెంట్స్ లో నటించిన వారి పాత్రలు అంత గొప్పగా ఏమీ ఉండవు. ఇక ప్రేక్షకులు ఎంతో ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్న తమన్నా పాత్ర కేవలం రొమాన్స్ వరకే ఉంది. నటన పరంగా నిరూపించుకోవడానికి ఆమె పాత్రకు స్కోప్ లేదు.

Lust Stories 2 Movie Review

Lust Stories 2 Movie Review

టెక్నికల్ గా ఎలా ఉందంటే..

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగానే ఉన్నాయి. మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. కెమెరా వర్క్ మాత్రం అద్భతుంగా ఉంది. కానీ డైరెక్టర్లు ఆర్.బాల్కి, సుజయ్ ఘోష్ లు నాసీ రకమైన కంటెంట్ ను ఎంచుకున్నారు. కేవలం లస్ట్ స్టోరీస్ కు ఉన్న క్రేజ్ ను వాడుకుని బోల్డ్ సన్నివేశాలతో సిరీస్ ను నింపేశారు. అంతే తప్ప డైరెక్షన్ పనితీరు పెద్దగా కనిపించదు. నటీనటుల నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా రాబట్టుకోలేకపోయారు. అమిత్ ఆర్.శర్మ, కొంకణ సేన్ శర్మల రైటింగ్ స్కిల్స్ ఆకట్టుకోవు. ఎడిటింగ్ లోపాలు కూడా ఉన్నాయి.

ప్లస్ పాయింట్లు..

బోల్డ్ సన్నివేశాలు
స్టార్ నటులు ఉండటం

Lust Stories 2 Movie Review

Lust Stories 2 Movie Review

మైనస్ పాయింట్లు..

ఆకట్టుకోని పర్ఫార్మెన్స్
కథలో బలం లేకపోవడం
మితిమీరిన శృంగారం

చివరగా..

లస్టో స్టోరీస్-1 లో బోల్డ్ సన్నివేశాలతో పాటు బలమైన కంటెంట్ ఉంది. కానీ సెకండ్ సీజన్ లో అంతకు మించి బోల్డ్ సీన్లు ఉన్నాయి కానీ కంటెంట్ బలంగా లేదు. కేవలం బోల్డ్ సీన్లు కావాలనుకునే వారికి మాత్రమే ఇది నచ్చుతుంది. ఇందులో మృణాల్, కాజోల్ సెగ్మెంట్లు మాత్రమే నచ్చుతాయి.

                                                                రేటింగ్ః 2.5/5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us