Itlu Maredumilli Prajaneekam Movie Review : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ: ప్రయత్నం మంచిదేగానీ..

NQ Staff - November 25, 2022 / 10:56 AM IST

Itlu Maredumilli Prajaneekam Movie Review : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ: ప్రయత్నం మంచిదేగానీ..

Itlu Maredumilli Prajaneekam Movie Review : అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే. కానీ, అతనిలో చాలా మంచి నటుడున్నాడు. పలు సినిమాలతో ఆయన తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసిన అల్లరి నరేష్ ఈసారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే పేరుతో తెరకెక్కిన ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఓ మోస్తరుగా క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో చూద్దాం పదండిక..

కథేంటంటే..

ఎలక్షన్ డ్యూటీ కోసం మారేడుమిల్లి అనే గిరిజన ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళతాడు హీరో. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి.? వాటి పరిష్కారం కోసం హీరో ఏం చేశాడు.? అన్నది అసలు కథ. అదేంటో తెరపై చూస్తేనే బావుంటుంది.

నటీనటుల పనితీరు..

ముందే చెప్పుకున్నాం కదా, అల్లరి నరేష్ మంచి నటుడని.! నటుడిగా అల్లరి నరేష్‌కి వంక పెట్టడానికేమీ లేదు. సినిమా మొత్తాన్నీ తన భుజాన మోసేందుకు ప్రయత్నించాడు, కొంతమేర సక్సెస్ అయ్యాడు కూడా.

ఆనంది తెరపై చూడ్డానికి అందంగా వుంది. తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దే అవకాశం వుంది.
వెన్నెల కిషోర్ బాగా చేశాడు. ప్రవీణ్, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేనిపిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు..

Itlu Maredumilli Prajaneekam Movie Review

Itlu Maredumilli Prajaneekam Movie Review

శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. కానీ, పాటల విషయంలోనే అతని మ్యాజిక్ పెద్దగా పని చేయలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి, ఆలోచింపజేసేలా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గానే వున్నాయి.

ప్లస్ పాయింట్స్

అల్లరి నరేష్
ట్రైబల్ బ్యాక్‌డ్రాప్

మైనస్ పాయింట్స్

Itlu Maredumilli Prajaneekam Movie Review

Itlu Maredumilli Prajaneekam Movie Review

ఎమోషనల్ కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడం
అక్కడక్కడా స్లో నెరేషన్

విశ్లేషణ

ట్రైబల్ ప్రాంతంలో సమస్యల గురించి నిత్యం వార్తల్లో వింటూనే వుంటాం. తెరపై ఆ సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు, కథలో లీనమవుతాం. అయితే, ఎమోషనల్ కనెక్టివిటీ కొన్ని చోట్ల అంత బలంగా లేదు. కొంతమేర కామెడీకి స్కోప్ వున్నా, దాన్ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు.

సరైన డ్రామా పండకుండానే, లాజిక్‌కి అందని విధంగా పనులు చకచకా జరిగిపోతుంటాయి.. అది కొంత సిల్లీగా అనిపిస్తుంది. అయితే, సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బావుంది. పాజిటివ్ నోట్‌తో ప్రేక్షకుడు థియేటర్ల నుంచి బయటకు వస్తాడు.

                                                              రేటింగ్: 2.5/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us