Hidimba Movie Review : హిడింబ మూవీ రివ్యూ.. అశ్విన్ హిట్ కొట్టాడా..?

NQ Staff - July 20, 2023 / 09:28 AM IST

Hidimba Movie Review  : హిడింబ మూవీ రివ్యూ.. అశ్విన్ హిట్ కొట్టాడా..?

Hidimba Movie Review  :

ఈ నడము సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టులతో వస్తున్న సినిమాలు చాలా బాగానే ఆడుతన్నాయి. ఇదే క్రమంలో యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత కాంబోలో వస్తున్న మూవీ హిడింబ. క్రైమ్ థ్రిల్లర్ కథకు నరమాంసభక్షకులను లింక్ పెట్టి దీన్ని తీశారు. ట్రైలర్ లోనే ఈ విషయం అర్థం అయింది. పైగా రివర్స్ ట్రైలర్ రిలీజ్ చేసి మరింత క్రేజ్ ను పెంచారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఎలా ఉందో చూద్దాం.

కథ..

హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. నగర వాసులు భయం భయంతో బతుకుతారు. ఈ క్రమంలోనే ఆద్య (నందితా శ్వేత) అనే ప్రత్యేక ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించుతారు. ఆమెకు సాయం చేయడానికి జూనియర్ ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు)ను నియమిస్తారు. వీరిద్దరూ కేసును ట్రాక్ చేయడం ప్రారంభిస్తారు. ఈ హత్యల వెనుక హిడింభా అనే నరమాసంభక్షకుల తెగ ఉందని తెలుసుకుంటారు. కానీ అసలు నరమాసంభక్షకులకు, సిటీలో జరిగే హత్యలకు అసలు సంబంధం ఏంటి.. నిజంగా వారే చేస్తున్నారా.. కేసును ఎలా చేధించారు, అసలు విలన్ ను ఎలా కనిపెట్టారు అనేది తెలుసుకోవాలంటే మూవీని థియేటర్ లో చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్..

Hidimba Movie Review

Hidimba Movie Review

అశ్విన్ బాబు ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్ మోడ్ లోనే కనిపిస్తాడు. సీరియస్ కేసును చేధించే ఆఫీసర్ గా బాగానే నటించారు. గత సినిమాలతో పోలిస్తే కాస్త పర్వాలేదు అన్నట్టే చేశాడు. ఐపీఎస్ ఆద్యగా నందితా శ్వేతా చక్కగానే నటించింది. కానీ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. అక్కడక్కడా ఆమె సీరియస్ నెస్ ను కోల్పోయింది. కీ రోల్ లో కనిపించే మకరంద్ దేశ్‌పాండే బాగానే నటించాడు. రఘు కుంచె మరోసారి తనలోని నటుడుని ఆవిష్కరించారు. సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ గా ఎలా ఉందంటే..

ఇప్పటి వరకు క్రైమ్ థ్రిల్లర్ కథలు చాలానే వచ్చాయి. కానీ ఈ కథకు హిడింబ అనే నరమాసంభక్షకులను యాడ్ చేసి కొత్తగా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు అనిల్. కానీ రొటీన్ సీన్లతో నింపేశాడు. నాలుగు సినిమాల సీన్లను కలిపి తీసినట్టు ఉంది ఈ మూవీ. కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడు గానీ.. సీన్లను ముడిపెట్టి తీయడంలో సక్సెస్ కాలేదు. లాజిక్ లేని సీన్లతో కథను మలుపులు తిప్పాడు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. ఇక పాటల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. బీజీఎం కూడా సీన్లకు తగ్గట్టు లేదు. రిపీట్ సీన్స్ తో నింపేయడం ఎడిటింగ్ లోపాలు చూపిస్తోంది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది.

ప్లస్ పాయింట్లు..
Hidimba Movie Review

Hidimba Movie Review

సెకండాఫ్ లోవచ్చే ఫైట్స్
నటీనటుల పర్ఫార్మెన్స్

మైనస్ లు..

కథలో బలం లేకపోవడం
రొటీన్ సీన్లతో నింపేయడం
ఆకట్టుకోని పాటలు

చివరగా..

హిడింబ ట్రైలర్ వరకే. కానీ తెరమీద చూస్తే కొత్తదనం ఏమీ ఉండదు. బోర్ కొట్టించే ఇన్వెస్టిగేషన్ సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. అంతగా ఆకట్టుకోదు.

                                                              రేటింగ్ః 2.25/5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us