Ginna Movie Review : ‘జిన్నా’ రివ్యూ: ఔట్ డేటెడ్ కథ, కథనం.!
NQ Staff - October 21, 2022 / 02:53 PM IST

Ginna Movie Review : మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ నటిస్తున్నారనగానే, ఈ సినిమా మీద ఓ మోస్తరు బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఇదొక హర్రర్ కామెడీ అనే ప్రచారం సినిమాపై మరింత ఇంట్రెస్టుని పెంచింది. అన్నిటికీ మించి, ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు మీద జరిగే ట్రోల్స్ పుణ్యమా అని, ‘జిన్నా’ సినిమా ఒకింత వార్తల్లో గట్టిగానే చోటు దక్కించుకుంది. ఇంతకీ, ‘జిన్నా’ కథ, కథనాల సంగతేంటి.? పదండిక తెలుసుకుందాం.
కథేంటంటే..
ముగ్గురు స్నేహితులు.. జిన్నా అలియాస్ గాలి నాగేశ్వరరావు, రేణుక, స్వాతి. వీరిలో రేణుక చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోతుంది. జిన్నా, టెంట్ హౌస్ నడుపుతుంటాడు. స్వాతి అతన్ని ప్రేమిస్తుంటుంది. కానీ, విదేశాల నుంచి రేణుక తిరిగొచ్చాక అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ, ఆ కీలక పరిణామాలేంటి.? జిన్నా ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడు? ప్రెసిడెంట్ కావాలన్న జిన్నా కోరిక నెరేవేరుతుందా.? లేదా.? అవన్నీ తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..

Ginna Movie Review
మంచు విష్ణు తన వరకూ బాగానే చేశాడు. డాన్సుల్లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ ఇదివరకే మంచు విష్ణు తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులోనూ ఆ విషయంలో విష్ణుకి వంక పెట్టలేం. డైలాగ్ డెలివరీ, పెర్ఫామెన్స్ స్కిల్స్ విషయంలో కొంత అప్డేట్ అయినట్లు అనిపిస్తుంది. అయితే, చిత్తూరు యాసలో మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడ్డాడు. ముఖ్యమైన సన్నివేశాల్లో తేలిపోయాడు.
పాయల్ రాజ్‌పుత్‌కి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. సన్నీలియోన్‌కి ఒకింత ప్రాధాన్యత ఎక్కువ వున్న పాత్ర దక్కింది. గ్లామర్ పరంగా చూసుకున్నా, స్క్రీన్ స్పేస్ పరంగా చూసుకున్నా సన్నీలియోన్ బెటర్, పాయల్ రాజ్పుట్ కంటే.
మిగతా పాత్రధారుల్లో వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తమ మార్కు చూపించేందుకు ప్రయత్నించారు.
ప్లస్ పాయింట్స్
పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్
సన్నీలియోన్ గ్లామర్
మైనస్ పాయింట్స్..
ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం..
సాగతీత ఎక్కువవడం
పాత కాలకపు కథ
విశ్లేషణ

Ginna Movie Review
పాత చింతకాయ పచ్చడి వ్యవహారంలా వుంది సినిమా. సినిమా చూస్తోంటే, ఇప్పటికే చూసేసిన చాలా సినిమాలు గుర్తుకొస్తాయ్. కాపోతే, సాగతీత మరీ ఎక్కువైపోయింది కొన్ని సన్నివేశాల్లో. సినిమా స్టార్టింగ్ ఒకింత ఇంట్రెస్టింగ్గా మొదలై, ఆ తర్వాత చప్పగా సాగుతుంది. పాటలు, కామెడీ, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్.. కొంతవరకు బాగానే అనిపిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే, మంచు విష్ణు సినిమా రిలీజ్‌కి ముందు చెప్పింత సీన్ లేదు.
రేటింగ్ 2/5