Dhamaka Movie Review : ‘ధమాకా’ రివ్యూ: రవితేజ మార్కు మాస్, మూస సినిమా.!
NQ Staff - December 23, 2022 / 11:55 AM IST

మాస్ మహరాజ్ రవితేజ అంటేనే మినిమమ్ గ్యారంటీ హీరో.! మాస్ సినిమాలకు పెట్టింది పేరు. కానీ, ఆ ఇమేజ్ ఈ మధ్య సన్నగిల్లింది. ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అందుకే, రిస్క్ చేయకుండా మాస్ మూస సినిమాని ఎంచుకున్నాడు. అదే ‘ధమాకా’.! ఈసారి హిట్టు పక్కా.. అంటూ సినిమా ప్రమోషన్లు గట్టిగా చేశారు. శ్రీలీల డాన్సులు అదుర్స్.. అంటూ ప్రచారం గట్టిగా జరిగింది. ఇంతకీ, సినిమా ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.? పదండి తెలుసుకుందాం.
కథేంటంటే..
పీపుల్ మార్ట్ అనే కంపెనీని నడుపుతోన్న వ్యాపారవేత్త తనయుడు ఆనంద్ చక్రవర్తి. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వామి. పీపుల్ మార్ట్‌ని దక్కించుకునేందుకు ఓ కార్పొరేట్ జెయింట్ చేసే ప్రయత్నం, దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఆంనద్ చక్రవర్తి, స్వామి మధ్య ఏం జరుగుతుంది.? అన్నది తరపైనే చూడాలి.
నటీనటుల పనితీరు..
రవితేజ కొత్తగా ఏం చేయలేదు. అయితే, మునుపటి ఎనర్జీ ఆయనలో మళ్ళీ కనిపించింది. లుక్స్ పరంగా కేర్ తీసుకున్నా, వయసు మీద పడుతున్న వైనం స్పష్టంగా కనిపించింది. ఆటిట్యూడ్, ఎనర్జీ.. హై లెవల్స్‌లో కనిపించాయి.
శ్రీలీల గ్లామరస్‌గా కనిపించింది. క్యూట్‌గానూ వుంది. డాన్సుల్లో అదరగొట్టేసింది. కానీ, కొన్ని సీన్స్‌లో తేలిపోయింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర మమ అనిపించేశారు.
సాంకేతికవర్గం పనితీరు..

Dhamaka Movie Review
యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. పాటలు తెరపై చూడ్డానికీ బావున్నాయి. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్ ఓకే. కొన్ని సీన్స్‌లో ఇంకాస్త కత్తెర పదును చూపించి వుండాల్సింది.
ప్లస్ పాయింట్స్
రవితేజ
శ్రీలీల
మైనస్ పాయింట్స్

Dhamaka Movie Review
పరమ రొటీన్ కథ, కథనం
తర్వాతేం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహించేసుకోగలగడం
విశ్లేషణ
రవితేజ నుంచి మరో మాస్ మూస సినిమా వచ్చింది. కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. కొన్ని తేలిపోయాయి. శ్రీలీల వల్ల ఫ్రెష్ అప్పీల్ కనిపిస్తుంది. కొన్ని సీన్స్ బలంగా వుంటే, చాలా సీన్స్ తేలిపోయాయి. హీరో ఎలివేషన్ సీన్స్ దగ్గర్నుంచి.. యాక్షన్ బ్లాక్స వరకూ అన్నీ పరమ రొటీన్. రవితేజ అభిమానుల్ని అలరించేలా వున్నా, కామన్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందనేది చెప్పడం కష్టం. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా తీసిన ఈ సినిమా ఆ ఆడియన్స్‌ని మెప్పించే అవకాశాలున్నాయ్.
రేటింగ్: 2.5/5