Custody Movie Review : నాగచైతన్య కస్టడీ మూవీ రివ్యూ..!

NQ Staff - May 12, 2023 / 09:45 AM IST

Custody Movie Review : నాగచైతన్య కస్టడీ మూవీ రివ్యూ..!

Custody Movie Review : నాగచైతన్య గత రెండు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రియమణి, అరవింద్ స్వామి లాంటి సీనియర్లు నటించారు. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ ఏంటంటే..

ఇది కాస్త వెరైటీగా అనిపించే కథ. శివ(నాగచైతన్య) పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి కృతిశెట్టి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ లోపే సంపత్ రాజ్, అరవింద్ స్వామి పాత్రల మధ్య నాగచైతన్య చిక్కుకుంటాడు. అరవింద్ ఇందులో డీసెంట్ విలన్ గా చేస్తాడు. అతనితో నాగచైతన్య జర్నీ ఎలా సాగుతుంది, ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది మిగతా కథ.

ఎవరెలా నటించారంటే..

నాగచైతన్య ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. చూడ్డానికి తెలివిగా, పోలీస్ పాత్రలో నటించే చతురత కలిగిన వ్యక్తిగా నటించాడు. ఇందులో నాగచైతన్య ఇమిడిపోవడానికి చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ఇక సీనియర్ యాక్టర్ అయిన అరవింద్ స్వామి ఇందులో డీసెంట్ క్రిమినల్ గా కనిపించాడు. కృతిశెట్టి పాత్ర కూడా పరిమితమైంది కావడంతో ఆమె కూడా పర్వాలేదు అన్నట్టే నటించింది. ప్రియమణి కూడా తనకు ఇచ్చిన దానితో ఓకే చేసింది. మిగతా సహాయ తారాగణం అంతా ఓకే.

Custody Movie Review

Custody Movie Review

టెక్నికల్ గా ఎలా ఉందంటే..

వెంకట్ ప్రభు అంటేనే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి ఆయన ఈ సినిమాను యాక్షన్ వైపు నడిపించడంలో వెనకబడ్డాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్‌ చాలా స్లోగా సాగుతుంది. అసలు కథలో కొన్ని లాజిల్ కు మిస్ అయినట్టే కనిపిస్తుంది. ఈ సినిమాలో అతని నటనలో వచ్చిన సమస్య సినిమాపై చాలా ప్రభావం చూపింది. ఒక సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టేస్తాడు. అందుకే చూస్తున్నంత సేపు హైప్ ఉండదు. ఇళయరాజా, యువన్ శంకర్ ల పాటలు ఏమంతగా ఆకట్టుకోలేదు. బీజీఎం కూడా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్..
కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు
నిర్మాణ విలువలు

Custody Movie Review

Custody Movie Review

మైనస్ పాయింట్స్..

పేలవమైన సీన్లు
బలహీనమైన కథనం
ఓవరాల్ గా స్క్రిప్ట్

తీర్పు:

నాగచైతన్యకు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. కస్టడీ మూవీలో కొత్తదనం ఏమీ లేదు. కేవలం ప్రమోషన్ల జోరు మాత్రమే ఉంది తప్ప.. కథలో బలం లేదు. ఈ సినిమా కేవలం నాగచైతన్య అభిమానలుకు తప్ప ఎవరికీ పెద్దగా నచ్చదే చెప్పుకోవాలి.

                                                                       రేటింగ్: 2/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us