Chandramukhi 2 Movie Review : చంద్రముఖి-2 రివ్యూ.. హిట్టా, ఫట్టా…?

NQ Staff - September 28, 2023 / 05:20 PM IST

Chandramukhi 2 Movie Review : చంద్రముఖి-2 రివ్యూ.. హిట్టా, ఫట్టా…?

Chandramukhi 2 Movie Review  :

అప్పట్లో రజినీకాంత్-నయన తార జంటగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ వస్తే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. అయితే దీనికి సీక్వెల్ గా ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి-2 మూవీని తెరకెక్కించారు. ఒర్జినల్ మూవీకి డైరెక్షన్ చేసిన పి.వాసు ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి, మరి అది ఎలా ఉందో చూద్దాం.

కథ…

మొదటి సినిమాలో జ్యోతికలోకి చంద్రముఖి ఆవహిస్తే ఆమె నుంచి చంద్రముఖిని వేరు చేస్తారు. అయితే ఇప్పుడు చంద్రముఖి-2 సినిమాలో స్వయంగా చంద్రముఖి రాజ్ మహళ్ లోకి వస్తుంది. ప్రశాంతంగా ఉంటున్న కైలాష్ కుటుంబం మళ్లీ ఇబ్బందిలో పడుతుంది. దాంతో రాఘవ లారెన్స్ వచ్చి ఆ చంద్రముఖిని బంధించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి.. చివరకు చంద్రముఖిని ఎలా బంధించాడు. అసలు వేటయ్య రాజు ప్రాముఖ్యత ఏంటి.. ఆ రాజుకు రాఘవ లారెన్స్ కు ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటీలు పర్ఫార్మెన్స్..

Chandramukhi 2 Movie Review

Chandramukhi 2 Movie Review

రాఘవ లారెన్స్ కు హర్రర్ లాంటి సినిమాలు కొత్తేమీ కాదు. ఈ సినిమాలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చూపించాడు. అంతే కాకుడా వేటయ్య రాజుగా ఫ్లాష్ బ్యాక్ సీన్లలో కనిపించి మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో అతని పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా పెద్దగా ప్లస్ కాలేదు. కానీ ఆయన నటన పరంగా పర్వాలేదనిపించుకున్నాడు. సెకండాఫ్ లో కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో అద్భుతంగా కనిపించి చంద్రముఖి ఆత్మకు పరిపూర్ణంగా ప్రాణం పోసింది. ఆమె తెరపై ఉన్నప్పుడు తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం స్క్రీన్ పై సునాయాసంగా ఆడిపాడింది. ఇక మిగిలిన పాత్ర దారులు వడివేలు, రాధిక, మహిమా, తదితరులతో సహా మిగిలిన సహాయ నటులు పెద్దగా ఏమీ చేయలేకపోయారు. కాకపోతే వారి పాత్రలకు అంతగా స్కోప్ లేదు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్..

డైరెక్టర్ పి.వాసు మొదటి సినిమా ఫార్ములానే ఇక్కడ మరోసారి ఫాలో అయ్యాడు. చాలా సీన్లు రిపీటెడ్ గా అనిపిస్తాయి. లారెన్స్, మహిమల మధ్య లవ్ ట్రాక్ మొదటి భాగం నుంచి రజినీకాంత్, నయనతారల మధ్య లవ్ ట్రాక్ కు పోలినట్టు కనిపించింది. అందుకే పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ బాగానే ఉన్నా ఫస్ట్ హాఫ్ మేజర్ బోర్ కొడుతుంది. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కారణంగానే సెకండాఫ్ కొంత వరకు ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. పాత కథను ఎంచుకున్నప్పుడు దర్శకుడు చేయాల్సింది ఇందులో కొత్త సీన్లు, కొత్త ట్విస్టులు చూపించాలి. కానీ వాటిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. కీరవాణి అందించిన సంగీతం, బీజీఎం బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, కెమెరా పనితనం బాగుంది, ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది.

ప్లస్ పాయింట్స్…

లారెన్స్, కంగనా నటన..
కథలో కొన్ని బలమైన సీన్లు..

Chandramukhi 2 Movie Review

Chandramukhi 2 Movie Review

మైనస్ పాయింట్స్:

రొటీన్ ఫార్ములా
బోరింగ్ ఫస్ట్ హాఫ్

చివరగా..

చంద్రముఖి-2 కొంతమేర మాత్రమే వినోదాత్మకంగా ఉంటుంది. కానీ ఇందులో చెప్పుకోవడానికి కొత్తగా బలమైన కథనం లేదు. కొత్తగా రాసుకున్న సీన్లు కూడా లేవు. ప్రధాన నటీనటుల పెర్ఫార్మన్స్ కారణంగా యావరేజ్ గా నిలిచింది.

                                                    రేటింగ్ః 2/5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us