Bhola Shankar Movie Review : భోళా శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

NQ Staff - August 11, 2023 / 10:55 AM IST

Bhola Shankar Movie Review : భోళా శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Bhola Shankar Movie Review  :

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలను నమ్ముకుంటున్నారు. ఇప్పటికే గాడ ఫాదర్ సినిమాతో అలరించిన ఆయన ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో వస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాలం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. కీర్తి సురేష్ ఇందులో చిరు చెల్లెలిగా నటిస్తోంది. పైగా తమన్నా అందం సినిమాకు గ్లామర్ ను తీసుకువచ్చింది. మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. మరి ఈ మూవీ చిరుకు మరో హిట్ ఇచ్చిందా లేదా అనేది చూద్దాం.

కథ..

శంకర్(చిరంజీవి) తన చెల్లెలు మహా (కీర్తి సురేష్) కోల్ కతాలో నివసిస్తారు. శంకర్ ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయితే కోల్ కతాలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు బాగా పెరుగుతాయి. అమ్మాయిలున కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులకు భోళా శంకర్ సాయం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆయన చెల్లెలు చిక్కుల్లో పడుతుంది. భోళా శంకర్ తన సొంత అన్న కాదని తెలుసుకుంటుంది. అసలు ఈ భోళా శంకర్ గతం ఏంటి.. అతను ఈ కేసుల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు,

లాయర్ తమన్నాతో ప్రేమ సంగతి ఏంటి, చివరకు విలన్ ను ఎలా అంతమొందించాడు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని థియేటర్ లో చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్..

Bhola Shankar Movie Review

Bhola Shankar Movie Review

భోళాశంకర్ పాత్ర పూర్తిగా యాక్షన్, ఎంటర్ టైనింగ్ లా ఉంటుంది. ఇలాంటి పాత్రల్లో చిరు గతంలో చాలానే చేశారు. కానీ ఈ సినిమాలో అది వర్కౌట్ కాలేదు. కామెడీ గానీ, యాక్షన్ సీన్లలో గానీ ఎక్కడా చిరు మేనియా కనిపించలేదు. నటనలో తలపండిన చిరు ఇలాంటి పేలవమైన సీన్లలో చేస్తాడని ఊహించలేం. పైగా తన వయసుకు తగ్గ సీన్లను పెట్టుకుంటే బెటర్. ఈ వయసులో కూడా అమ్మాయిలతో చిలిపి టీజింగ్ లాంటివి మానుకుంటే బెటర్. అది చూసే వారికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది. మొత్తంగా ఈ మూవీలో చిరు నటన మెప్పించలేదు. ఇక మహానటి కీర్తి సురేష్‌ తన పాత్రకు తగ్గట్టే ఏదో పర్వాలేదనిపిస్తుంది. తమన్నా పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఎంతసేపు చిరుతో లవ్ అంటూ తిరుగుతుంది. అది పెద్దగా ఆకట్టుకోదు. మిగతా పాత్రలకు అంతగా స్కోప్ లేదు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్..

వేదాలం సినిమాకు రీమేక్ గా తీసిన మెహర్ రమేశ్ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకోలేదు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అనేవి చాలా కీలకం. కానీ మెహర్ రమేశ్ వీటిని గాలికొదిలేసినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్లు ఎక్కువగా పెట్టారు. కానీ ఒక్కటి కూడా పేలలేదు. పైగా చిరాకు కలిగించేలా ఉన్నాయి. చిరంజీవి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్లు పరమ చెత్తగా ఉన్నాయి. ఇది చిరు స్థాయికి తగ్గ కామెడీ కాదు. పోనీ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉందా అంటే అదీ లేదు.

ఈ సినిమాను చూస్తే ఇరవై ఏళ్ల క్రితం తీయాల్సిన మూవీలా అనిపిస్తుంది. అంత బోరింగ్ గా ఉంది. అందరికీ తెలిసిన కథను తీస్తున్నప్పుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ మెహర్ రమేశ్ ఆ విషయమే మర్చిపోయాడు. ఏవో నాలుగు కామెడీ సీన్లు, రెండు యాక్షన్ సీన్లతో మూవీని నింపేశాడు. క్లైమాక్స్ కూడా ముందే ఊహించేలా ఉంది.

చాలా రొటీన్ సీన్లతో చిరాకు తెప్పించాడు. మహథి స్వర సాగర్ పాటల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత బెటర్. ఒక్కటి కూడా పేలలేదు. బీజీఎం పర్వాలేదు. ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్..

Bhola Shankar Movie Review

Bhola Shankar Movie Review

చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు

మైనస్ పాయింట్స్..

టోటల్ మూవీ

చివరగా..

భోళా శంకర్ రీమేక్ మూవీ. అలాంటప్పుడు కొత్తగా సీన్లను రాసుకోవాలి. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ బాగా పండేలా చూసుకోవాలి. అప్పుడే పాత కథను కొత్తగా చూపించినట్టు ఉంటుంది. కానీ ఈ విషయంలో దర్శకుడు మెహర్ రమేశ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మెగాస్టార్ స్థాయికి తగ్గ సినిమా ఇది కాదు. మెగా అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చదు. ఇది చిరంజీవి కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ మూవీ.

                                                               రేటింగ్ః 1.5/5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us