vakeel saab Movie USA Live Updates : వకీల్ సాబ్ మూవీ యూఎస్ లైవ్ అప్‌డేట్స్‌

Vakeel Saab Live Updatesvakeel saab Movie USA Live Updates

MovieVakeel Saab
Star CastPawanKalyan, Shruti Haasan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj
DirectorVenu Sriram
ProducerBoney Kapoor, Dil Raju, Sireesh
MusicS. Thaman
Run Time2h 34m
Release9th April 2021

 

12.45 AM: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ వ‌కీల్ సాబ్ బొమ్మ తెర‌పై ప‌డింది. 2 గంటల 34 నిమిషాల నిడివితో ప్రారంభ‌మైంది ఈ మూవీ

12.50 A.M: ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మ‌గువా మగువా పాట‌తో మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ పాట‌ ద్వారా హీరోయిన్స్‌ను ప‌రిచయం చేస్తూ వ‌చ్చారు.

12.55 A.M: ఈ సినిమా యొక్క కీలక సన్నివేశాలు ఇప్పుడే మొద‌లైంది. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య, అబ్బాయిలతో గోడవకు దిగ‌డంతో వారు ఇబ్బందుల‌ని ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ముగ్గురు న‌టీమ‌ణులు మంచి ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రుస్తున్నారు.

01.00 A.M: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. చాలా కూల్ గా ఆయ‌న ఎంట్రీ ఉంది. ప‌వ‌న్ ప‌రిచ‌య స‌న్నివేశానికి థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎంట్రీ ఫైట్ కూడా చాలా చ‌క్క‌గా ఉంది.

01.05 A.M: ముగ్గురు హీరోయిన్స్‌కు సంబంధించిన ప్ర‌ధాన వివాదం మ‌రింత పెరుగుతుంది. ఎంట్రీ ఫైట్ చక్క‌గా డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు

01.10 A.M: నివేదా థామస్ త‌న‌ను మరియు ఆమె స్నేహితులను వేధిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు నివేదాను అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. దృశ్యాలు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

01.15 A.M: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత నట ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. స్క్రీన్ ప్ర‌జెన్స్, డిక్ష‌న్ చాలా బాగుంది.

01.20 A.M: వేధింపుల‌కు గురైన ముగ్గురు యువ‌తుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసారు.

01.25 A.M: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇప్పుడే మొద‌లైంది. త‌న గత జీవితం గురించి చెబుతున్నారు ప‌వ‌న్

01.30 A.M: సామాజిక స‌న్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి. ఇప్పుడే వ‌కీల్ సాబ్ రెండ‌వ పాట ప్రారంభ‌మైంది. ఈ పాట చ‌క్క‌గా చిత్రీక‌రించ‌బ‌డ‌టంతో పాటు ప‌వ‌న్ న్యాయ‌వాది వృత్తిని అభివ‌ర్ణిస్తుంది

01.35 A.M: ఇక చిత్ర క‌థానాయిక శృతి హాస‌న్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ప‌వన్ క‌ళ్యాణ్, శృతి హాస‌న్ మ‌ధ్య కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు న‌డుస్తూ ఉండ‌గా, కంటి పాప అనే సాంగ్ మొదలైంది.

01.45 A.M: జీవితంలో కొన్ని దిగ్భ్రాంతిక‌ర‌మైన ప‌రిస్థితుల వ‌ల‌న పవ‌న్ క‌ళ్యాణ్ లా ప్రాక్టీస్ వ‌దులుకుంటాడు. దీంతో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే నివేదా థామ‌స్, అన‌న్య‌, అంజ‌లి బెయిల్ కోసం ప‌వ‌న్ సాయం చేసే స‌న్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి

01.55 A.M: యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఫ‌స్టాఫ్ ముగిసింది. తిరిగి న్యాయ‌వాదిగా ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వడంతో అస‌లు క‌థ మొదలు కానుంది. కాసేపు విరామం ఇచ్చారు.

ఫ‌స్టాఫ్ రిపోర్ట్: మొత్తానికి ఫ‌స్టాఫ్ అదిరిపోయింద‌నే చెప్పాలి. స‌త్య‌దేవ్ అనే లాయ‌ర్ పాత్రలో ప‌వ‌న్ అద్భుతంగా న‌టించారు. అంజ‌లి, నివేదా థామ‌స్, అన‌న్య వారి వారి పాత్రల‌కు చ‌క్కని న్యాయం చేశారు. క‌మ‌ర్షియ‌ల్ అంశంంతో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఉంది. ఇది చ‌క్క‌గా ఉంది. ఇక సెకండాఫ్ సినిమాకు చాలా కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.

02.05 A.M: సెకండాఫ్‌లో డిఫెన్స్ లాయ‌ర్‌గా విల‌క్ష‌న న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు యువ‌తుల‌ను వేధించిన వ్యక్తుల త‌రపున వాదించే లాయ‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్ క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోటీగా ప్ర‌కాశ్ రాజ్ కేసును వాదిస్తున్నారు. కోర్టు స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

02.10 A.M: పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య కోర్టులో వాదిస్తున్న ఘర్షణ దృశ్యాలు వ‌స్తున్నాయి. వాదోప‌వాద‌న‌లు పోటాపోటీగా సాగుతున్నాయి.

02.20 A.M: ప్రస్తుతం కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది. క‌థకు మూలం ఈ స‌న్నివేశాలు కాగా, వీటిని చాలా అద్భుతంగ డిజైన్ చేశాడు శ్రీరామ్ వేణు. నివేదా థామ‌స్ చ‌క్క‌ని అభిన‌యాన్ని ప్ర‌ధ‌ర్శిస్తుంది.

02.30 A.M: చిత్రం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. పవ‌న్ క‌ళ్యాణ్‌, నివేదా థామ‌స్, థ‌మ‌న్, ప్ర‌కాశ్ రాజ్‌లు సినిమాని చక్క‌గా న‌డిపిస్తున్నారు.మ్యూజిక‌ల్ స‌ర్‌ప్రైజ్ కూడా బాగుంది.

02.40 A.M: కోర్ట్ రూంలోని సన్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ చాలా చ‌క్క‌గా ఉంది. ఇది సినిమా క‌థ‌నానికి బ‌లాన్ని చేకూర్చింది.

02.45 A.M: మ‌రొక యాక్ష‌న్ ఎపిసోడ్ మొద‌లైంది. ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న క‌ళ్యాణ్ మేన‌రిజం, బాడీ లాంగ్వేజ్ ఇందులో బాగా క‌నిపిస్తున్నాయి.

02.50 A.M: ఇప్పుడే స‌డెన్‌గా ఓ ట్విస్ట్ ఏర్ప‌డింది. వృత్తి ప‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ కి ఊహించని అడ్డంకి ఏర్ప‌డింది.

03.00 A.M: పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ – అంజలి క్రాస్ ఎగ్జామినేషన్ సన్నివేశాలు వ‌స్తున్నాయి. అనంత‌రం ఎమోష‌న‌ల్ ఎపిసోడ్ సాగ‌గా, మూవీ క్లైమాక్స్ వైపు దూసుకొస్తుంది.

03.05 A.M: పింక్ సినిమాలో ఫేమస్ అయిన “నో” అని చెప్పే సీన్ లో నివేదా చాలా చక్కగా చేసి చూపించింది.

03.10 A.M: కోర్ట్ రూంలో ముగ్గురు వ్య‌క్తుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌శ్నించాడు. చిత్రం ఇతివృత్తం ఏంట‌నేది ఈ స‌న్నివేశాల ద్వారా తెలియ‌జేయ‌డ‌మైంది. ఇది ప్ర‌భావింతంగా క‌నిపిస్తుంది

03.15 A.M: స్త్రీల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పే డైలాగ్స్ చాలా ఆలోచించ‌ద‌గిన‌విగా ఉన్నాయి. అనంత‌రం మెట్రో ఫైట్ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

03.20 A.M: మొత్తానికి చిత్రంలో ముగ్గురు లేడీస్ న్యాయం పొందుతారు. ఎమోష‌న‌ల్ నోట్‌తో చిత్రానికి ముగింపు ప‌లికారు. వ‌కీల్ సాబ్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గానే కాకుండా మంచి మెసేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం. ప్రేక్ష‌కుల‌కి ఈ మూవీ మంచి ఫీస్ట్ అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

పూర్తి రివ్యూ కోసం న్యూస్ క్యూబ్ వెబ్ సైట్‌ను ఫాలో కండి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న పేరు ఒక పేరు ఓ ప్ర‌భంజ‌నం. అడుగేస్తే బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్దలు కావ‌డం ఖాయం. చూడ్డానికి బ‌క్క ప‌ల‌చ‌గా క‌నిపించిన ధైర్యం విసిరిన రాకెట్ మ‌న ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప‌డిచచ్చిపోతుంటారు. రాజ‌కీయాల వ‌ల‌ర మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అంటూ ప్రీ రివ్యూ ఇచ్చేశారు.సాలిడ్, టెర్రిఫిక్.. పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటూ ట్వీట్లు పెట్టాడు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రాన్ని త‌న ఫ్యామిలీతో క‌లిసి చూసేందుకు చిరంజీవి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ లో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటించ‌గా, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద అభిమానులతో సందడి మొదలైంది. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Advertisement