rang de movie review : నితిన్ రంగ్ దే మూవీ రివ్యూ..స్లోగా సాగే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

Samsthi 2210 - March 26, 2021 / 09:54 AM IST

rang de movie review : నితిన్ రంగ్ దే మూవీ రివ్యూ..స్లోగా సాగే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

విడుదల తేదీ : మార్చి 26, 2021
నటీనటులు : నితిన్, కీర్తి సురేష్‌,నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్ర‌సాద్

rang de movie review : భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ వ‌రుస సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. కొద్ది రోజుల క్రితం చెక్‌తో అల‌రించిన నితిన్ ఈ రోజు రంగ్ దే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. నితిన్, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కించారు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తే అర్జున్‌, అనుగా నితిన్‌, కీర్తి సురేష్ న‌టించ‌గా, ఆ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా నడించిందనే కథ, అందులో ట్విస్టులు లాంటి సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు

rang de movie review

rang de movie review

కథ:

అర్జున్ పాత్ర‌లో న‌టించిన నితిన్ చిన్న‌ప్పుడు త‌న‌కొక గార్ల్ ఫ్రెండ్ కావాల‌ని అనుకోగా, ప‌క్కింట్లోకి అను( కీర్తి సురేష్‌) రూపంలో వ‌స్తుంది. అయితే తాను గార్ల‌ఫ్రెండ్ కాద‌ని, త‌న పాలిట రాక్ష‌సి అని మెల్ల‌మెల్ల‌గా అర్జున్‌కు అర్ధ‌మ‌వుతుంది. అర్జున్‌- అనుల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గమంట‌ది. ఇద్ద‌రికి ఒక్క నిమిషం కూడ ప‌డ‌దు. అయితే ఓ సంద‌ర్భంలో అర్జున్ త‌ప్ప‌క అనుని పెళ్లి చేసుకోవ‌ల‌సి వ‌స్తుంది. అను అంటే ఆమ‌డ దూరం వెళ్లే అర్జున్ పెళ్ల‌య్యాక ఆమెతో కాపురం చేశాడా‌, వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అలానే న‌డిచాయా, ఒకరినొక‌రు అర్ధం చేసుకొని సంసారం చేశారా అనేది వెండితెర‌పై చూడాల్సిందే.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ :

నితిన్ ఎప్ప‌టిలానే త‌న క్యూట్ అండ్ స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొట్టాడు. అర్జున్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించాడు. కామెడీ , ఎమోష‌న‌ల్ సీన్స్‌లో వావ్ అనిపించాడు. ఇక మ‌హాన‌టి కీర్తి సురేష్ నిజంగా మ‌హా నాటి అనిపించింది. అల్ల‌రి పిల్ల‌గా అద్భుతంగా న‌టించింది. సీనియ‌ర్ న‌రేష్ తండ్రిగా అల‌రించారు. నితిన్ – నరేష్ మధ్య సీన్స్ లోని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. సుహాస్, అభినవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీలు తమ పాత్రల‌తో ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:

సినిమాని అద్భుతంగా చూపించ‌డంలో పీసీ శ్రీరామ్ దిట్ట‌. ఇందులో ప్ర‌తి సీన్‌ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఇక దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ప్ర‌తి పాట ఆక‌ట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ కూడా క్లాసీగా ఉంది. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి చెప్పాల‌నుకున్న పాయింట్‌ను కాస్త ఎమోష‌న‌ల్‌గా చూపించి ప్ర‌శంసలు పొందుతున్నాడు. అయితే నేరేషన్ చాలా స్లోగా ఉండడంతో పాటు ప్రతి సన్నివేశం సాగదీసినట్టు ఉండడం అనేది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌:

– నితిన్, కీర్తి సురేష్, న‌రేష్‌ ల పర్ఫార్మన్స్
– కామెడీ సీన్స్
– దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్‌:

– రొటీన్ క‌థ‌నం
– స్లో నెరేషన్స్ తో సాగదీసే సీన్స్
– వ‌ర్కవుట్ కాని ఎమోష‌న్స్

తీర్పు:

వెంకీ అట్లూరి సినిమా అంటే ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్‌కు వెళ‌తారు. అయితే ఫ‌స్టాఫ్‌లో సినిమానే బాగానే న‌డిపిన‌, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించిన‌ట్టు అనిపిస్తుంది. క‌థ‌లో కంటెంట్ లేక‌పోవ‌డం, స్లో న‌రేష‌న్ సినిమాకు మైన‌స్ అయ్యాయి. నితిన్ – కీర్తి సురేష్ లా ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం ఆడియ‌న్స్‌ను నిరుత్సాహ‌ప‌రుస్తుంది.రంగ్ దే అంత క‌ల‌ర్‌ఫుల్ కాదు కాని, రొటీన్ ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు నాలుగు కామెడీ సీన్స్ చూసి స‌ర‌దా ప‌డేవారు సినిమాకు వెళ్ళ‌వ‌చ్చు

రేటింగ్ : 2.5/ 5

Read Today's Latest Review in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us