Ponniyin Selvan1 Review : పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ : అరవ ఫ్లేవర్ ఎక్కువయ్యింది
NQ Staff - September 30, 2022 / 08:41 AM IST

Ponniyin Selvan1 Review : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా గత కొన్ని దశాబ్దాల కాలంగా చెప్పుకుంటున్న పొన్నియన్ సెల్వన్ అప్పట్లో కమల్ హాసన్ తో తెరకెక్కించాలని భావించినా వీలు పడలేదు. ఎట్టకేలకు సాహసం చేసి కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే సినిమాను రూపొందించడం జరిగింది. గత ఏడాదికాలంగా సినిమా గురించి ప్రతి రోజు మీడియాలో వార్తలు వస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి వివరిస్తూ ఈ కథ సాగింది. చోళ రాజ్యపు వంశం గురించి అత్యంత అద్భుతంగా కథలో వివరించడం జరిగింది. చోళ రాజ్యంను దక్కించుకునేందుకు ప్రయత్నించే వారి నుండి రాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్) ఎలా రక్షించేందుకు వ్యూహాలు వేస్తాడు… అందులో కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్) పాత్రలు ఏంటీ అనేది సినిమా కథ. ఒక గొప్ప ఉద్యమ కథ గా దీన్ని చెప్పుకోవచ్చు.
నటీనటుల నటన :
చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్ నటించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఒక గొప్ప యోధుడి పాత్రలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అది కొందరికి మాత్రమే సాధ్యం. అది విక్రమ్ కి సాధ్యం అయ్యింది. ఆ పాత్ర కోసం మణి సర్ ఎంతో మందిని సంప్రదించాడు. వారంతా కూడా ఇప్పుడు ఆ పాత్ర చేయనందుకు బాధపడేలా విక్రమ్ నటించాడు అనడంలో సందేహం లేదు.
ఇక త్రిష అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. అన్ని వర్గాల వారిని ఆమెప్పించే విధంగా ఆమె పాత్ర ఉంది. ఇక నందిని గా ఐశ్వర్య చాలా విభిన్నంగా నటించింది. ఆమె పాత్ర యొక్క లుక్ కూడా ఆమె అభిమానులకు కన్నుల విందు అనడంలో సందేహం లేదు. ఇక కార్తి తన యొక్క పాత్ర కు నూరు శాతం న్యాయం చేశాడు. జయం రవి నటన కూడా బాగుంది. ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర నటీ నటులు అంతా కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ :
మణిరత్నం ఒక గొప్ప దర్శకుడు అనే విషయంలో ఈ మధ్య కాలంలో కొందరిలో అనుమానాలు ఉండేవి. కానీ ఆ అనుమానాలు ఈ సినిమాతో తొలగి పోతాయి అనే చెప్పాలి. ఆయన తాను అనుకున్న కథను ప్రేక్షకులకు అన్ని విధాలుగా అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్న విధానం అద్భుతం. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు తమిళ ఫ్లేవర్ ఉండటం వల్ల కాస్త ఇబ్బందిగా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా బాగుంది. తెలుగు లో డబ్బింగ్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- స్టార్ కాస్ట్,
- మణిరత్నం దర్శకత్వం,
- కథ, కథనం
మైనస్ పాయింట్స్ :
- తమిళ ఫ్లేవర్,
- కొన్ని పాత్రలకు ప్రాముఖ్యత దక్కలేదు
విశ్లేషణ :
తమిళ బాహుబలి అంటూ పొన్నియన్ సెల్వన్ ను తమిళ మీడియా ఆకాశానికి ఎత్తింది. తెలుగు లో మాత్రం మొదటి నుండి కూడా సో సో అన్నట్లుగానే అంచనాలు ఉన్నాయి. తక్కువ అంచనాలు ఉన్నప్పుడు విడుదల అయ్యి ఒక మోస్తరుగా ఉన్నా కూడా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ కి అదే ఫలితం దక్కేలా ఉంది. సినిమా లో పాటలు కొన్ని సన్నివేశాలు తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నాయి.. డబ్బింగ్ లో క్వాలిటీ వల్ల తెలుగు సినిమా అన్నట్లుగా కొన్ని సార్లు ఫీల్ కలుగుతుంది. కనుక ఈ సినిమా ఒక మోస్తరుగా అయినా ఆడే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.