wild dog movie review : సస్పెన్స్ ని మిస్ చేసిన వైల్డ్ డాగ్ మూవీ రివ్యు

wild dog movie review  : విడుదల తేదీ : ఏప్రిల్ 2, 2021
నటీనటులు : నాగార్జున, దియా మీర్జా
దర్శకత్వం : అహిషోర్ సోల్మన్
సంగీత దర్శకుడు: తమన్ ఎస్.ఎస్
కింగ్ నాగార్జున హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. దేశవ్యాప్తంగా ఇవాళ రిలీజైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరు పదుల వయస్సు వచ్చానా.. అదే ఆత్మవిశ్వాసంతో తెలుగు తెరపై దూసుకుపోతున్నారు హీరో నాగార్జున. ఈ నేపథ్యంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ గా నిజమైన సంఘటనల ఆధారంగా వైల్డ్ డాగ్ ను రూపొందించారు. బాంబు పేలుళ్ళ కేసులో హీరో టీమ్ ఎలా చేధిస్తుందనేది సినిమా. మరి వ్యూహాత్మక కథనాన్ని డైరెక్టర్ వైల్డ్ గా తెరకెక్కించారో లేదో సినిమా రివ్యూలో చేసెద్దాం..

కథ : వైల్డ్ డాగ్.. 2000 సంవత్సరంలో పూణే, హైదరాబాద్ ప్రాంతాలను బాంబు పేలుళ్ళతో హడలెత్తించిన సంఘటనలు. వీటిని ఆధారంగా చేసుకుని కథను రూపొందించారు దర్శకుడు. దేశంలో నానాటికి పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, వాటి వెనుక ఉన్న సూత్రదారుల్ని పట్టుకునేందుకు ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మ అండ్ టీమ్ ఏవిధంగా ఈ కేస్ ని చేధించిందనేది అసలు కథ. సినిమాలో అమాయకపు ప్రజల్ని హీరో టీమ్ కాపాడిందా.. లేదంటే ఆ బాంబు పేలుళ్ళకు బలయ్యిందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Nagarjuna wild dog movie review
Nagarjuna wild dog movie review

ప్లస్ పాయింట్స్ : నాగార్జున పర్ఫార్మెన్స్ వైల్డ్ డాగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. స్టోరీ రన్ టైమ్ ఫాస్ట్ గా, క్రిస్పిగా ఉండటం మరో హైలెట్. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతంగా సాగిపోతుంది. హీరోయిన్స్ తో పాటు వైల్డ్ డాగ్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్: సినిమా స్టోరీ లైన్ తెలిసినదే అయినా, తెరకెక్కించిన విధానం ఫ్లాట్ గా ఉండటంతో ప్రేక్షకుడు నిరాశ చెందుతాడు. నేరస్తుల్ని, ఉగ్రవాద సంస్థ సూత్రదారుల్ని వెతికి పట్టుకునే తరహాలో థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం. ముఖ్యంగా సినిమాకు టీమ్ వర్క్ మిస్ అయ్యిందనిపించడం సినిమాని డిజప్పాయింట్ చేస్తాయి.

సాంకేతిక విభాగం : వైల్డ్ డాగ్ సినిమాతో అహిషోర్ సోల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. టెక్నికల్ గా వైల్డ్ డాగ్ సినిమా ఆకట్టుకుంది. విలక్షణపరమైన కథను తీసుకుంటూనే.. వాణిజ్య పరంగా తెరకెక్కించారు డైరెక్టర్. వైల్డ్ డాగ్ అనేది స్పై థ్రిల్లర్. ఈ సినిమాలో ఒక సంఘటన జరిగిన తరువాత నేరస్థుడ్ని పట్టుకునేందుకు సన్నాహాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ విషయంలోనూ టెక్నికల్ టీమ్ ఎంతో జాగ్రత్త వహించినట్లు తెలుస్తుంది. ఎడిటింగ్ స్కిల్స్ కూడా సినిమాను హైలెట్ చేశాయి. సస్పెన్స్ స్టోరీకి స్క్రీన్ ప్లేతో పాటు టేకింగ్ కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడినట్లు తెలుస్తుంది.

తీర్పు : ఫైనల్ గా వైల్డ్ డాగ్ అనేది జరిగిన భావోద్వేగమైన ఘటనల్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ప్రయత్నం అభినందనీయం. ప్రతి ఒక్కరూ కథకు, వైల్డ్ డాగ్ టీమ్ కి కనెక్ట్ అవుతారు. ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలిగొన్న ఉగ్రవాదం అంతం అవ్వాలనే ఆలోచనలతో, ఆశయంతో తెరకెక్కించడం అద్భుతం.

రేటింగ్ : 2.5/ 5

Advertisement