Chavu Kaburu Challaga Movie Review : కార్తికేయ వన్ మ్యాన్‌ షో గా చావు కబురు చల్లగా

విడుదల తేదీ : మార్చి 19, 2021
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం : కౌశిక్
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్

Chavu Kaburu Challaga Movie Review : తెలుగు ప్రేక్షకులను తమ మొదటి సినిమాలతోనే మెప్పించిన తారలు కార్తికేయ, లావణ్య త్రిపాఠి. యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కార్తికేయ ఆర్ఎక్స్ 100 లో పర్ఫార్మెన్స్ ని అద్దరగొట్టారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠిల లేటెస్ట్ ఎంటర్ టైనర్ చావు కబురు చల్లగా.. ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. టైటిల్ తోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ : కథలోకి ఎంటర్ అయితే చనిపోయిన మృతదేహాల్ని తీసుకెళ్ళే స్వర్గపురి వాహనానికి డ్రైవర్ హీరో బస్తీ బలరాజు. తనకు కావాలనుకున్నది తనకు దక్కేవరకు పోరాడే మనస్తత్వం బస్తీ బలరాజుది. ఓ రోజు ఓ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ చనిపోయిన పీటర్ భార్య హీరోయిన్ మల్లిక కనిపిస్తుంది. అలా ఫస్ట్ సైట్ లోనే ఆమెతో ప్రేమలో పడతాడు బాలరాజు. ఇక ఆమెను ప్రేమలో దింపడానికి బాలరాజు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇక విసిగిపోయిన మల్లిక, బాలరాజు మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడే హీరో తల్లి ఆమని ఓ ట్విస్ట్ తో తెరమీదకు వస్తుంది. ఆ ట్విస్ట్ తో బాలరాజు లైఫ్ లో ఓ టర్నింగ్ పాయింట్ వస్తుంది. చివరకు బాలరాజుని మల్లిక ప్రేమించిందా.. లేదా.. ఇంతకీ బాలరాజుని మార్చిన ఆమని ట్విస్ట్ ఏంటి? అనేదే అసలు కథ.

Chavu Kaburu Challaga Movie Review
Chavu Kaburu Challaga Movie Review

ప్లస్ పాయింట్స్ : కార్తికేయలోని వినూత్నమైన యాక్షన్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. వన్ మాన్ షో లా అద్దరగొడతాడు. ఒక విడో క్యారెక్టర్ లో లావణ్య అభినయం ఆకట్టుకుంటుంది. ఒక విడో ని ఫాలో అవుతున్నప్పుడు వచ్చే ఫన్ ప్రేక్షకులను ఎంటర్ చేస్తుంది. హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్: కథని సెకండాఫ్ లో డ్రాప్ చేసినట్లుగా ఉంటుంది. ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడం, సెకండాఫ్ లో కామెడీ కంటెంట్ తగ్గడం, డైరెక్టర్ స్లో నేరేషన్ సినిమాకి మైనస్ లుగా నిలుస్తాయి.

సాంకేతిక విభాగం : సునీల్ రెడ్డి, కర్మ్ చావ్లా డైనమిక్ గా డిజైన్ చేసిన విజువల్స్ చాలా బావున్నాయి. బస్తీ ఫీల్ తో బాలరాజు మేకింగ్ ఆకట్టుకుంటుంది. ఇక జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ అట్రాక్ట్ చేస్తుంది. ఎమోషనల్ కంటెంట్ కి, కామెడీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అద్భుతంగా అందించారు మ్యూజిక్ డైరెక్టర్. జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్ చాలా నాచురల్ గా ఉంది. టెక్నికల్ యాక్ట్స్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించాయనే చెప్పాలి.

తీర్పు : చావు కబురు చల్లగా సినిమా హాయిగా సరదాగా సాగడం ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తుంది. అలాగే కథకి కీలక పాత్రగా నిలిచిన కార్తికేయ పర్ఫార్మెన్స్, డీ గ్లామర్ లుక్ లో అద్భుతంగా నటించారు. ఏది ఏమైనా డైలాగ్స్ తో, కార్తికేయ, లావణ్య త్రిపాఠి ల అభినయంతో చావు కబురు చల్లగా ఉంటుంది.

రేటింగ్ : 2.5/ 5

Advertisement