Connect with us

Entertainment

త్వరలో తెర పైకి వస్తున్న నన్ను దీవించండి ; రేణుదేశాయ్

Published

on

Share the News from here

టాలీవుడ్ లో రేణుదేశాయ్ అనే పేరు తెలువని వారంటూ ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన రేణు దేశాయ్ సినిమాలకు గత కొన్ని సంవత్సరాలుగా చాలా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా రేణు కొన్ని విషయాలు వెల్లడించింది. త్వరలోనే మళ్లీ యాక్టింగ్ చేయనున్నానని రేణూదేశాయ్‌ పేర్కొంది. కృష్ణమామిడాల దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ నటిస్తున్నారు.

అయితే వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ విషయాన్ని రేణూ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. త్వరలో కెమెరా ముందుకు రానున్నాని, చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. అలాగే ప్రేక్షకులు మీ దీవెనలు అందించి మీ సపోర్ట్ కావాలని ఆమె పోస్ట్ ద్వారా తెలిపింది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!