Connect with us

Entertainment

ఎన్ సి బి ముందు రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన విషయాలు ఇవే..!

Published

on

Share the News from here

దేశంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సుశాంత్ సింగ్ కేసులో తన ప్రియురాలు రియా చక్రవర్తిని ఆరా తీయగా అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు దీపికా పదుకోనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు వచ్చాయి. అయితే నిన్న ముంబైలో రకుల్ ని ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇక ఈ విచారణలో పలు విషయాలు బయట పెట్టింది రకుల్. అయితే తాను రియా చక్రవర్తితో డ్రగ్స్ గురించి చాట్ చేశానని రకుల్ ఒప్పుకున్నట్లు తెలిసింది.

అయితే తాను ఎలాంటి డ్రగ్స్ వాడలేదని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. రకుల్ స్టేట్ మెంట్ ను పరిశీలించి, కోర్టు ముందు పెడతామని ఎన్ సీబీ డైరెక్టర్ జనరల్ ముథా అశోక్ జైన్ వెల్లడించారు. ఇక ఈ విచారణలో ఎన్ సీబీ కి రకుల్ మరో నలుగురు సెలబ్రిటీల పేర్లను చెప్పినట్లు ‘టైమ్స్ నౌ’ చానెల్ తెలిపింది. అలాగే డ్రగ్స్ అమ్మేవాళ్లు ఎవరితోనూ తనకు సంబంధం లేదని కూడా ఆమె స్పష్టం చేసినట్లు పేర్కొంది.

Do NOT follow this link or you will be banned from the site!