Connect with us

Latest News

కేసీఆర్ కు తమ బాధను చెప్పుకున్న ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు

Published

on

Share the News from here

కరోనా ప్రభావం దాదాపు అన్ని పరిశ్రమల మీద పడింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అలాగే ఇప్పుడు తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రయివేట్ విద్యాసంస్థల యజమానులు సీఎం కేసీఆర్ కు తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందిని తాము ఎదుర్కోలేమని ప్రైవేట్ విద్యాసంస్థలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ కు విన్నవించుకున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయడం పదో తరగతి విద్యార్థులను పాస్ చేయడం వల్ల ముగిసిన 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన సుమారు 50 శాతం వరకు ట్యూషన్ ఫీజులు ఇంకా తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్ ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ఈ సంవత్సరం యొక్క ఫీజులు కూడా అందలేదని, ఆన్లైన్ తరగతులు నిర్వహించినా కూడా ఫీజులు రావడం లేదని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, పాఠశాలలు మూతపడితే అనేక మంది ఉపాధిని కూడా కోల్పోతారని వెల్లడించారు. అలాగే తెలంగాణ యొక్క విధ్యను మీరే కాపాడాలని కేసీఆర్ కు విన్నవించుకున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!