Ys vivekananda reddy : వివేకా వర్ధంతి సాక్షిగా బయటపడ్డ షర్మిల- జగన్ విభేదాలు ? జగన్, భారతి ఎక్కడ ?

Ys vivekananda reddy :  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, సీఎం జగన్ యొక్క సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురై నేటికీ రెండు ఏళ్ళు అయ్యింది. ఆయనకు సంబధించిన వర్ధంతి కార్యక్రమం పులివెందుల‌లో వివేకాఘాట్ వ‌ద్ద జరిగింది. దీనికి వివేకా కూతురు సునీత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు షర్మిల, వైఎస్ భార్య వైఎస్ విజ‌య‌మ్మ‌తో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. కానీ సీఎం జగన్ కానీ ఆయన భార్య భారతి కానీ ఎక్కడ కనిపించలేదు.

Ys Vivekananda Reddy
Ys Vivekananda Reddy

వివేకా తొలుత గుండెపోటుతో చనిపోయాడేమో అనుకున్నారు, ఆ తరువాత ఆయన శరీరంపై ఉండటంతో అది హత్య అని తేలింది. దీనితో పెద్ద దుమారమే చెలరేగింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీపై వైసీపీతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా పలు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అయితే వివేకా హత్యకేసు విషయంలో సీబీఐ విచారణకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. సిట్‌లు ఏర్పాటు చేసినా కేసును ఛేదించలేకపోయారు. అంతేకాకుండా ఈ కేసులో పలు అనుమానాలున్నాయని, వైఎస్ జగన్ ఈ కేసు విచారణ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనే అర్థం వచ్చేలా వివేకా కుమార్తె సునీత పలు ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంపై వివేకా కుమార్తె సునీత కేరళలో సామాజిక కార్యకర్త జోమున్‌ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోపక్క షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టటం జగన్ ఇష్టం లేదని, పార్టీ పెట్టవద్దని జగన్ చెప్పిన కానీ షర్మిల వినలేదని వైసీపీ ముఖ్యనేత సజ్జల చెప్పుకొచ్చాడు. అన్న చెల్లెల్లు మధ్య ఉన్నా విభేదాలు కొత్త పార్టీకి దారి తీశాయని తెలుస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంల షర్మిల పులివెందులకు వెళ్లడం, వివేకా వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావడం, వైఎస్ జగన్‌తో పాటు భారతీరెడ్డి గైర్హాజరు కావడం, అవినాష్ రెడ్డి కుటుంబీకులు కూడా దూరంగా ఉండడంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక ఇంటికి పెద్ద దిక్కు అయిన విజయమ్మ కూడా తన మద్దతు కూతురికి ఇస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వైఎస్ బంధువుల పెళ్ళికి కూడా షర్మిల, విజయమ్మ మాత్రమే కలిసి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వైఎస్ ఘాట్ వద్దకు కూడా షర్మిల ఒక్కటే వెళ్లి కాసేపు ఉంది రావటం మనం గమనించవచ్చు, గతంలో ఏదైనా కార్యక్రమం జరిగితే జగన్ తో సహా కుటుంబం మొత్తం కలిసి వెళ్లేవాళ్ళు, కానీ నేడు ఆ పరిస్థితి కనిపించటంలేదు. సీఎం జగన్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నకాని కనీసం భారతి గారనే కనిపించాలి కదా… మరి దీనికి ఏ కోణంలో అర్ధం చేసుకోవాలో ఏమిటో..?

Advertisement