YS Sharmila : ప్రగతి భవన్లో వేల కోట్లు: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.!
NQ Staff - December 1, 2022 / 03:15 PM IST

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఇటీవల తనను హైద్రాబాద్లో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం, పాదయాత్ర సందర్భంగా తమపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫిర్యాదు చేశారు.
వైఎస్ షర్మిల అరెస్టు తీరుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటికే ఖండించిన విషయం విదితమే. కాగా, వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్పై సంచలన ఆరోపణలు చేశారు.
ప్రగతి భవన్లో వేల కోట్లున్నాయ్..
ప్రగతి భవన్లో సోదాలు నిర్వహిస్తే వేల కోట్లు దొరుకుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ‘నా గతం ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. నాకేమైనా జరిగినా, కార్యకర్తలకు ఏం జరిగినా కేసీయార్దే బాధ్యత..’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
‘టీఆర్ఎస్ నేతలు వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు.?’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘పాదయాత్ర ద్వారా నాకు ప్రజల్లో పెరిగిన మద్దతు, మా పార్టీకి పెరుగుతున్న మద్దతుని చూసి టీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోంది..’ అంటూ షర్మిల అభిప్రాయపడ్డారు.
YS Sharmila Complained To Governor Tamilisai Soundararajan