YS Sharmila : కాళేశ్వరం అవినీతిపై వైఎస్ షర్మిల ఫిర్యాదు.! ఎవరి పొలిటికల్ ఖేల్ ఖతం.!
NQ Staff - October 7, 2022 / 05:37 PM IST

YS Sharmila : ప్రాజెక్టులు, అవినీతి.. రెండూ కవల పిల్లలని అంటారు ప్రజాస్వామ్యవాదులు. భారతదేశంలో అవినీతి వ్యవస్థీకృతం. రోడ్లెయ్యాలంటే అవినీతి.. ఇంకేదన్నా చెయ్యాలంటే అవినీతి.! అసలు అవినీతి లేనిదెక్కడ.?
వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.. డబ్బులు ఖర్చు చేయకుండానే పాదయాత్రకి జనాన్ని రప్పిస్తున్నారా.? ఇదిగో, ఇక్కడే అవినీతి మొదలవుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రమే కాదు, ఏ రాజకీయ పార్టీ అధినేత లేదా.. ఏ రాజకీయ పార్టీ నాయకుడు జనంలోకి వెళ్ళాలన్నా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయాల్సిందే.! అలాంటప్పుడు, రాజకీయ నాయకులకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది.?
ప్రశ్నించాల్సిందే గానీ..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైనే ఖర్చయ్యిందనేది ఓ అంచనా. లక్ష కోట్ల మేర అవీనీతి జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అదెలా సాధ్యం.? అసలు ప్రాజెక్టుకి అయిన వ్యయమెంత.? నిజానికి, కాళేశ్వరం అనేది రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు. దేశంలో అధికారంలో వున్న బీజేపీ ఈ విషయంలో ఏం చేయగలుగుతుంది.?
కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా, నేరుగా సీబీఐకి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై. సీబీఐ వెంటనే విచారణ చేపట్టేసి, నిజాలు నిగ్గు తేల్చేస్తుందా.? ఇదే సీబీఐని గతంలో వైఎస్ షర్మిల తూలనాడారు, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు సాగుతూ సాగుతూ వున్న విషయం షర్మిలకు కళ్ళ ముందే కనిపిస్తోంది కదా.? మరి, కాళేశ్వరంపై తాను ఫిర్యాదు చేయగానే సీబీఐ స్పందించేస్తుందని ఆమె ఎలా అనుకున్నారో ఏమో.!
కేసీయార్ ఖేల్ ఖతం అయిపోతుందని వైఎస్ షర్మిల అనుకుంటున్నారేమోగానీ.. బీజేపీ ఆటలో పావుగా మారిన షర్మిల పొలిటికల్ ఖేల్ ఖతం అయిపోతుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.