బాలయ్య ని గురి చూసి కరెక్ట్ టైమ్ లో చావుదెబ్బ కొట్టిన వైఎస్ జగన్ ?
PBN - November 9, 2020 / 08:30 AM IST

జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరిని జగన్ టార్గెట్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. దీనితో బయపడి చాలా మంది నేతలు టీడీపీకి రాజీనామా చేసి, కుదిరితే వైసీపీ లోకి లేకపోతే బీజేపీలోకి జంప్ అయిపోయారు. అలా వెళ్ళటం కుదరని నేతలు టీడీపీలో వుంటూ లో-ప్రొఫైల్ మెయింటన్స్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రీతిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
అయితే వైసీపీ సర్కార్ మాత్రం వివిధ రకాలుగా బాలకృష్ణ ను ఇబ్బంది పెడుతుంది. ఆయన అల్లుళ్ళు విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే పాపం బాలయ్య అనకుండా ఉండలేము. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ విషయంలో వైసీపీ సర్కార్ అసలు వెనక్కి తగ్గటం లేదు. ఆక్రమించిన భూమిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన జగన్ సర్కార్ దానిని అంతటితో వదిలిపెట్టకుండా విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడంతో పాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించిందని, తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు పలు పత్రికలో వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో నిజాల నిగ్గు తేల్చేందుకు తక్షణమే గీతం నియమాల ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దేకు లేఖ రాశారు.
ఏఐసీటీఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తూ గీతం విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించి అందులో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిందని ఆయన ఆరోపించారు. “ఆ భవనాలు ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూమిలో నిర్మించిన విషయాన్ని దాచిపెట్టి గీతం ఏఐసీటీఐ నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు అనుమతులు సంపాదించింది. తద్వారా ఏఐసీటీఈని గీతం యాజమాన్యం తప్పుదారి పట్టించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా కేటగిరీ 1 గ్రేడ్‌తో స్వయంప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ హోదాను దక్కించుకున్న గీతం ఇలాంటి దురాక్రమణలకు పాల్పడి ప్రభుత్వ భూముల్లో అకడమిక్ భవనాలు నిర్మించడం అత్యంత శోచనీయం` అని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఏఐసీటీఐ నియమ నిబంధనలకు అనుగుణంగా గీతం చర్యలు లేనందున ఇంజనీరింగ్ కోర్సుల ఆమోదం కోసం ఆ విద్యా సంస్థ గతంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌పై విచారణ జరిపి కొన్నిఇంజనీరింగ్ విభాగాల భవనాలు నిర్మించిన భూమి వివాదారహితమైనదో కాదో నిర్ధారించేందుకు తక్షణమే ఏఐసీటీఈ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విజయసాయి రెడ్డి వాలకం చూస్తుంటే గీతం కు డీమ్డ్ అనుమతులు క్యాన్సిల్ అయ్యేదాకా ఊరుకునేలా లేదనిపిస్తుంది. మరోపక్క లోకేష్ ను వైసీపీ సర్కార్ ఎంతగా టార్గెట్ చేస్తుందో అందరికి తెలిసిన విషయ. ఇలా ఇద్దరి అల్లులను ఏకకాలంలో వైసీపీ సర్కార్ టార్గెట్ చేసి బాలయ్యకు పెద్ద షాక్ ఇస్తుందనే చెప్పాలి.