YS Jagan: జ‌గ‌న్ రాజ‌కీయం.. ప‌వ‌న్ సినిమాల‌ని టార్గెట్ చేస్తూ ప్ర‌తీకారం తీర్చుకుంటున్నారా..!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్‌.. పవ‌న్‌, చంద్ర‌బాబుపై త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఆయ‌న సినిమాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తుందా అనిపిస్తుంది. అందుకు కార‌ణం ఏప్రిల్ 4న ప‌వ‌ర్ క‌ళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ విడుద‌ల కాగా, ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.

YS Jagan, Pawan Kalyan
YS Jagan, Pawan Kalyan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే అభిమానుల‌లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వకీల్ సాబ్ చిత్రం ప‌వ‌న్ రీఎంట్రీ మూవీ కాగా, ఈ సినిమాకు భారీ రేట్స్ పెంచాల‌ని నిర్మాత‌లు భావించారు. కాని ఏపీ ప్ర‌భుత్వం అందుకు అన‌మ‌తులు ఇవ్వ‌లేదు. జీవో నెంబర్ 35ను అనుసరించి అన్ని తరగతుల టికెట్ రేట్లను ఈ కింది విధంగా సవరించటడమైనది.. 100, 80, 40 రూపాయలుగా ఉంటాయ‌ని ధియేటర్ల ముందు బోర్డులు పెట్టారు.

గతంలో ధియేటర్ యాజ‌మాన్యం ఇష్టానుసారం రేట్లు పెంచుకొని లాభాలు ఆర్జించేవి. ఎంత ధర చెబితే అంతే.. సినిమా ధియేటర్లలో కొత్త మార్పును చూసి ప్రేక్షకులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఇదంతా ప‌వ‌న్‌పై కక్ష్య‌తోనే చేశార‌ని జ‌న‌సైనికులు చెప్పుకొచ్చారు. అయితే మ‌రో రెండు రోజుల‌లో థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వడంతో పాటు సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టాన్ని స‌వ‌రించింది.

రానున్న రోజుల‌లో విడుద‌ల కానున్న సినిమా నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిల్మ్ ప్రాతిప‌దిక‌న రేట్లు పెంచుకోవచ్చ‌ని జీవోలో తెలిపింది. వ‌కీల్ సాబ్ రిలీజ్ స‌మ‌యంలో రేట్లు పెంచుకోవడానికి అడ్డు ప‌డ్డ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు అనుమ‌త‌లు ఎలా ఇచ్చిందంటూ జ‌న‌సైనికులు మండిప‌డుతున్నారు. రానున్న రోజుల‌లో ప‌వ‌న్ సినిమాల‌పై జ‌గ‌న్ ఇలాంటి వైఖ‌రే చూపిస్తే ఊరుకునేది లేద‌ని జ‌న‌సైనికులు అంటున్నారు.

కాగా రానున్న రోజుల‌లో సినిమాల విడుద‌ల విష‌యానికి వ‌స్తే దసరాకు వస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించగా… ఎస్ఆర్ కల్యాణమండపం అనే చిన్న సినిమా ఆగస్టు 4న వస్తున్నామని ప్రకటించింది. అయితే నాగ చైతన్య లవ్ స్టోరీ, గోపీచంద్ సీటిమార్ కూడా వీలైనంత త్వరగా విడుదల కావాలని అనుకుంటున్నాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడితే … ఈ రెండిట్లో ఒకటి జులై 30నే విడుదల చెయ్యాలని ఆలోచనట. నాని టక్ జగదీష్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ఆగష్టు చివరన లేదా సెప్టెంబర్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.