ఎన్నాళ్ళకి నోరు తెరిచావయ్యా, స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ స్ట్రాంగ్ కామెంట్స్
Mamatha 600 - December 19, 2020 / 06:00 PM IST

ఏపీ కేబినెట్ భేటిలో అంధ్రప్రదేశ్ సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులకు,ఎమ్మెల్యే లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మనకు మంచి అవకాశం వచ్చిందని సీఎం జగన్ అన్నట్టు తెలిసింది.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తుంది.ఎప్పటినుంచో పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నాము. అందుకనే ఎలాగయినా ఈసారి ఈనెల 25 న పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నారని తెలిసింది.

cm jagan
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే, మంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని సీఎం జగన్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రతి ఊరికి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెళ్లి పట్టాలు అందజేయాలని జగన్ ఆదేశించారు.ఇలా స్థానిక సంస్తల ఎన్నికల ముందు గ్రామాల్లో ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ఇదో మంచి సదావకాశమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సూచించిన భూములను చదును చేసేందుకు వస్తున్న ట్రాక్టర్లు వాహనాలను ఎస్ఈబీ అధికారులు ఆపేస్తున్నారని మంత్రులు ఈ సమావేశంలో సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అందుతుంది. మేము ప్రభుత్వం యొక్క పనికోసమే ఒకచోట నుండి ఇంకోచోటకి మట్టి తీసుకెళుతున్నాం అని చెప్పిన గాని వినిపించుకోవడం లేదని విన్నవించారు.
ఈ సమస్యలపై సీఎం జగన్ స్పందించి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. అలాగే రేషన్ కార్డుల తొలగింపుపై కూడా మంత్రులు జగన్ కు ఫిర్యాదు చేసారు. ఎట్టి పరిస్థితిలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ బీమా డబ్బులను కూడా మరో వారం రోజుల్లో అర్హుల ఖాతాల్లోకి జమ చేయమని బ్యాంకర్లకు చెప్పాలని ఆర్థిక శాఖను జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది..ఇవన్నీ చూడబోతే సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు విషయంపై బాగానే ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది.. !!