జగన్ అనుకున్నది అనుకున్నట్టు గా జరగట్లేదు..లోపం ఎక్కడుంది ?

జగన్ పరిపాలన అదికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్టంలో చాలా మార్పులు సంభవించాయి. అనేక రకాలయిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఎంతగానో చేరువయ్యారు. అయితే మూడు రాజధానుల విషయంలో మాత్రం ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి కొంచెం వ్యతిరేకత వచిన్నపటికి పట్టు వదలని విక్రమార్కుడు లాగా మూడు రాజధానుల కోసం పోరాడుతూనే ఉన్నారు మన ఏపీ సీఎం జగన్. అయితే మూడు రాజధానుల బిల్లు విషయంలో, సీఆర్డీయే రద్దు బిల్లు విషయంలో  ప్రతిపక్షాలు ఒప్పుకోలేదని జగన్ శాసన మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి కూడా చాలా రోజులే అవుతుంది. కరోనా వైరస్ కారణం, లేదా మిగితా కొన్ని కారణాల వల్ల కేంద్రం దీన్ని పెద్దగా పట్టించుకోకుండా నాన్చుతూ వస్తుంది. ఇన్ని రోజులు అవుతున్న గాని ఇప్పుడు కూడా ఈ రద్దును కేంద్రం పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. అయితే అప్పట్లో జరిగిన పెద్దల సభను ఇలా జగన్ తన సొంతానికి రద్దు చేయడం పై కేంద్రంలో కొంత వ్యతిరేకత ఉందని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ అందుకేనేమో జగన్ ఈ విషయంపై ఒక అడుగు వెనుకకు వేస్తున్నారా అని నేతలు తర్జన మర్జన పడుతున్నారు. శాశన సభను రద్దు చేసి కేంద్రం ఆమోదం కోసం బిల్లును పంపగా ఇన్నిరోజులు ఆలస్యం అవుతూ వచ్చింది.

ys jagan

అలాగే మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే  జగన్ ఈ మండలి రద్దు విషయంలో మరొక మారు అలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకు కారణాలు కూడా లేకపోలేదట..తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆయన కుమారుడు బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో మండలిని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో మండలిని కొనసాగించాలని జగన్ పూర్తిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అయన ఒక్కడికే కాకుండా చాలామంది కార్యకర్తలకు అయన ఎమ్మెల్సి పదవి ఇస్తానని మాట ఇచ్చారట..

గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ వంటి వారు జగన్ ద్వారా ఇప్పటికే హామీ పొంది ఉన్నారు. ఇలా రానున్న రోజులలో చాలా మందికి ఇక మీదట జగన్ మండలిలో పదవులు భర్తీ చేస్తారని అంటున్నారు. ఇక మండలి విషయంలో జగన్ మాట మార్చేశాడు అని కూడా అనుకుంటున్నారు.అయితే జగన్ తీసుకోబోయే ఈ నిర్ణయాన్ని వైసీపీ నేతలు పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే మండలి ఉంటే బోలెడు పదవులు వస్తాయని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మండలి రద్దు చేయకపోవడం లాంటి నిర్ణయం, మూడు రాజధానులపై ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? లేదా అనేది వేచి చుడాలిసిందే.. !!

Advertisement