Jagananna Amma Vodi : లారీ ఎక్కి ఊగుతున్నాడు.. పవన్ పై మండిపడ్డ సీఎం జగన్!
NQ Staff - June 28, 2023 / 03:16 PM IST
Jagananna Amma Vodi : ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి.. పవన్ వారాహి యాత్ర అంటూ రోజుకొక నగరంలో సభ నిర్వహిస్తూ అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి.. అలాగే చంద్రబాబు కూడా తన స్ట్రాటజీలతో 2024 ఎన్నికలో అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరుగుతున్నారు.
ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు అని మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా నిధుల విడుదల చేస్తూ కురుపంలో భహిరంగ సభ ఏర్పాటు చేయగా అక్కడ జగన్ ప్రసంగించారు.
45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఏ రోజు ప్రజలకు మంచి చేయాలని ఆలోచించలేదని 14 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మంచి చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్య మంత్రి గా గెలిచినా మంచి చేయని ఈ బాబు ఏ వర్గానికి మంచి చేయని ఈ బాబు మరోసారి మ్యానిఫెస్టోతో అధికారం ఇవ్వండి అంటూ అడగడానికి రెడీ అయ్యాడు. వీళ్లకు తోడుగా ఒక దత్త పుత్రుడు ఉన్నాడు.
ఆ దత్త పుత్రుడు గత ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు మద్దతు పలికారు.. ఎన్నికల తర్వాత ఆయన చేసిన మోసం గురించి ఎందుకు మాట్లాడలేదు.. ఆ ప్యాకేజీ స్టార్.. వారాహి అనే ఒక లారీ ఎక్కి ఆయనకు నచ్చినట్టు మాట్లాడుతూ ఊగిపోతున్నారు.. ఆయనలా నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేం.. మీ చల్లని దీవెనలు అండ నాకు ఇవ్వండి. మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటేనే నాకు అండగా నిలవండి అని.. ఇంకా మీకు మంచి జరగాలని దేవుడిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..