YS Jagan Mohan Reddy : ఏపీ స్టూడెంట్లకు అంతర్జాతీయ గుర్తింపు.. జగన్‌ విధానాలపై స్విట్జర్‌ లాండ్‌ అధ్యక్షుడి ప్రశంసలు..!

NQ Staff - February 25, 2023 / 12:41 PM IST

YS Jagan Mohan Reddy : ఏపీ స్టూడెంట్లకు అంతర్జాతీయ గుర్తింపు.. జగన్‌ విధానాలపై స్విట్జర్‌ లాండ్‌ అధ్యక్షుడి ప్రశంసలు..!

YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యావ్యవస్థ పనితీరు అద్భుతంగా నడుస్తోంది. ఏపీలో పేద విద్యార్థలుకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రవేశ పెట్టిన నాడు-నేడు విద్యా వ్యవస్థతో పాటు.. డిజిటల్‌ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ లో భాగంగా అందరికీ ల్యాప్‌ ట్యాప్‌ ల పంపిణీ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయి.

 YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

ఈ విధానాలపై ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో తాజాగా స్విట్జర్‌ లాండ్‌ అధ్యక్షుడు కూడా ప్రశంసించాడు. తాజాగా స్విట్జర్‌ లాండ్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్‌ నేషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ అనే ప్రోగ్రామ్‌ ను నిర్వహించారు. ఇందులో ఏపీ విద్యా వ్యవస్థను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వ పథకాల స్టాల్‌ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

భవిష్యత్‌ లో గుర్తింపు..

దాన్ని పరిశీలించిన ఇగ్నా జియో క్యాసిన్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. జగన ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కీమ్‌ లతో ఏపీ విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్‌ అందుతోందని కొనియాడారు. భవిష్యత్‌ లో ఏపీ విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతుందని చెప్పుకొచ్చారు.

 YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

YS Jagan Mohan Reddy Introduced Naadu Nedu Education System Running Brilliantly

స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్‌ అందించడం మంచి పరిణామం అన్నారు. అలాగే విద్యార్థులుకు ప్లే గ్రౌండ్స్‌, లైబ్రెరీలు, యూనిఫాం, స్టేషనరీ కిట్స్‌ లాంటివి అందించడం మంచి విషయం అన్నారు. ఇవన్నీ జగన్‌ విధానాలకు నిదర్శనం అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us