YS Jagan Mohan Reddy : చంద్రబాబు ఎమ్మెల్యేగా అన్‌ఫిట్.! ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్‌ఫిట్.!

NQ Staff - September 23, 2022 / 06:55 PM IST

160351YS Jagan Mohan Reddy : చంద్రబాబు ఎమ్మెల్యేగా అన్‌ఫిట్.! ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్‌ఫిట్.!

YS Jagan Mohan Reddy : కుప్పం నియోజకవర్గం బీసీలకు చెందినదట. అలాంటి చోట చంద్రబాబు పోటీ చేయడమేంటని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.. అదీ కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ. ఈ విషయమిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

YS Jagan Mohan Reddy comments on Chandra Babu Naidu

YS Jagan Mohan Reddy comments on Chandra Babu Naidu

ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా వుంటే, ఆ సామాజిక వర్గానికే ఆ నియోజకవర్గ ప్రజా ప్రతినిథిగా అవకాశం వుండాలన్నదే నిజమైతే, రాష్ట్రంలో ఓసీ సామాజిక వర్గాలకు ఒక్కటంటే ఒక్క నియోజకవర్గమూ దక్కకూడదు. అంతెందుకు పులివెందులలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు.

ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తారా.?

బీసీ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా వున్న కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడానికి అనర్హుడని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే నిజమైతే, ఆ మాటలకు వైఎస్ జగన్ కట్టుబడి వుంటే, వెంటనే పులివెందుల ఎమ్మెల్యే పదవికి, ముఖ్యమంత్రి పదవికీ వైఎస్ జగన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి.

అంతే కదా మరి.? అయితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచో లేదంటే బీసీ సామాజిక వర్గాల నుంచో మాత్రమే రాష్ట్రంలో ప్రజా ప్రతినిథులుండాలి. ఎందుకంటే, ఏ నియోజకవర్గం తీసుకున్నా.. దళితులు లేదా బీసీలే ఎక్కువగా వుంటారు కదా.! ఈ చిన్న లాజిక్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా మిస్సయ్యారబ్బా.!

జనంలో చైతన్యం వచ్చి, నిజంగా సామాజిక వర్గ సమీకరణాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే, రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరుగుతాయ్.!