YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి స్వయానా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సడ్డకుడు..స్వయానా సీఎం జగన్ కి బాబాయ్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మలుపులు తిరిగిన అనేక ఘటనల్లో జగన్ పక్కన ఉండి అన్ని తానై వ్యవహరించిన అత్యంత కీలక వ్యక్తి. జగన్ జైలు జీవితం మొదలు షర్మిల పాదయాత్ర వరకు పార్టీకి వెన్నుముక లాంటి వ్యక్తి. ప్రభుత్వం అధికారంలోకి వేస్తే సీఎం తర్వాత స్థానం సుబ్బారెడ్డి కి మాత్రమే అనుకున్నారంతా.. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.
అధికారంలోకి రావడం మొదలు ఇప్పటి వరకు వైవికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ పదవితోనే కట్టబెట్టడం తప్ప మరొకటి ఇవ్వలేదు సీఎం జగన్. అయితే వైవీ అలోచనలు మాత్రం ఎంపీగా వుండాలి అనేదే. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎంపిగా టికెట్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ విఫలం అవుతూ వస్తున్నారు.
గతంలో ఆయన లోకసభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. గత లోకసభ,రాజ్యసభ సమయంలో చివరి నిమిషంలో అనేకమంది చోటు దక్కించుకున్నవారే.ఇప్పుడు మళ్లీ రాజ్యసభ నోటిికేషన్ల సమయం ఆసన్నమైంది. అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి..వినిపిస్తున్న పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి అని సమాచారం..కానీ రెండవ సారి టీటీడి ఛైర్మెన్ పదవికి రాం రాం చెప్పి ఢిల్లీకి వెళ్దాం అనుకున్న వైవీ ఆశలపై మళ్ళీ నీళ్ళు చల్లినట్లు తెలుస్తుంది.
తెలంగాణా నుండి ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డికి దాదాపుగా టికెట్ ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఇక మై హోం రమేశ్వరా రావుకి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
- Advertisement -
ఇక ఏపీ కోట నుండి మళ్ళీ విజయసాయిరెడ్డికి ,
బీద మస్తాన్ రావు, కిళ్ళీ కృపారాణి ,అలి..లిస్ట్ లో వున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసే మంత్రాంగం ఏపి నుండి ఢిల్లీకి గ్యాప్స్ లేకుండా పార్టీకి మంచి పేరు తెస్తుండడంతో మళ్ళీ విజయసాయిరెడ్డికి ఛాన్స్ ఇస్తున్నట్లు బోగట్టా.. సో ఒకవిధంగా చెప్పాలంటే వైవీ ఆశలపై విజయసాయిరెడ్డి నీళ్ళు చల్లినట్లే.
ఇంట్లో వారికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పరిస్థితుల్లో జగన్ బయట వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండటంతో చర్చకు దారితీస్తుంది .గత కొన్ని రోజుల క్రితమే విజయసాయిరెడ్డికి పార్టీలో అన్ని అనుబంధ కమిటీల బాధ్యతల్ని సీఎం జగన్ అప్పగించారు.ఇప్పుడు రాజ్యసభ సీట్ కూడా కన్ఫర్మ్ అయిందంటే పార్టీలో విజయసాయిరెడ్డి స్థానం ఎలాంటిదో అర్దం చేసుకోవాలంటు ఆయన అనుచరులు చెప్తున్నారు.
రెండు సార్లు ఆశించి భంగపడ్డ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అబ్బాయ్ జగన్ ఎలా నచ్చజెబుతారు?వైవీ మళ్ళీ పార్టీలో ఎలా కీలకం అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ.