అర్రెర్రే ప్రతి సంఘటన జగన్ కి అనుకూలంగా భలే మారిపోతోందే !!

ఆంధ్ర రాజకీయాల్లో వైస్ జగన్ ఏది చేసిన సంచలనమే. 2018 ఎన్నికల్లో వైసీపీ ప్రజల మనసులను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని, అక్రమాలను ఈ ఎన్నికల సమయంలో ప్రజల ముందు పెట్టడం లో వైస్ జగన్ గెలిచారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ప్రజలు సైతం అనుభవం ఉన్న వ్యక్తిని కాదని యువకుడైన జగన్ కి పట్టం కట్టారు. ఇక అయన జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చంద్రబాబు ఎంత వ్యతిరేకించిన రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉంది అంటూ కొత్త ప్రతి పాదన తీసుకొచ్చి , రాజధానిని విశాఖకు తరలించి ప్రతిపక్షాల నడ్డి విరిచారు.

jagan vs chandra babu

ఇక విశాఖకు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్ట్ కి వెళ్లడం వల్ల సమస్య మొదటికి వచ్చింది. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే రాజధాని విశాఖకు తరలించడం వల్ల పెట్టుబడులు ఎలా వస్తాయి అనేది. కానీ దానికి వైస్ జగన్ ఒక ప్రణాళిక వేసుకున్నారు అనేది ఇప్పడు అందరికి తెలియబోతుంది. ఇది వరకు టీడీపీ ప్రభుత్వం తమ హయంలో లక్షలకోట్ల పెట్టుబడులు వస్తాయని తెగ హడావిడి చేసి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. తమ అనుకూల మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాబోతున్నట్టు రాయించుకున్నారు. కానీ రాష్ట్ర ఖజానా కాళీ అయితే చేసారు కానీ అయన ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే వైస్ జగన్ కి అస్త్రం లాగా మారింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు మరియు విజయ సాయి రెడ్డి కలిసి అధికారుల సమక్షంలో పారిశ్రామిక సదస్సు అతి తక్కువ ఖర్చు తో చేసి తమ సత్తా ఏంటో చూపించింది. ఇక పెట్టుబడులకు ఎలాంటి డోకా ఉండదంటూ వైస్ జగన్ ప్రభత్వం చెప్పకనే చెప్పింది.

విశాఖ యువతకు అవకాశాలు

విశాలో జరిగిన పారిశ్రామిక సదస్సు ద్వారా ఏపీకి కొత్త పెట్టుబడులు ఆహ్వానించిన వైస్ జగన్ త్వరలోనే మంచి పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆలా అయితే లోకల్ గా ఉండే యువత కు చాల లాభదాయకం గా మారుతుందని చెప్పారు. ఇప్పటికే విశాఖ ను రాజధానిగా మార్చిన నేపథ్యంలో సమీప భవిషత్తులో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశాఖ పట్నం పేరు మారుమోగుతుంది అంటూ వైస్ జగన్ చెప్పుకోచ్చారు. ఇలా చంద్రబాబు చేపట్టిన సదస్సులను వైస్ జగన్ రాష్ట్ర ప్రగతికి వాడుతూ ముందుకు వెళ్తున్నారు.

Advertisement