Pawan Kalyan : 151 వర్సెస్ జీరో.! పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తారెందుకు?
NQ Staff - November 27, 2022 / 08:54 PM IST

Pawan Kalyan : ‘మీరు గెలిచింది 151 సీట్లు.. నేనేమో రెండు చోట్లా ఓడిపోయాను. నా మీద పడి ఏడుస్తారెందుకు.?’ అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నాకు తెలిసింది సాయం చేయడం మాత్రమే. సినిమాల్లో సంపాదిస్తున్నాను.. దాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు.? ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మీ పేర్లు పెట్టుకుంటున్నారు.
పైగా, అయినవారికి పదవులు కట్టబెట్టుకుంటున్నారు.. కొత్త కొత్త పదవులు ప్రవేశ పట్టి, మీ పార్టీ నేతలకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నారు..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలిప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
సత్తా.. తాకత్..
‘నేను ఓడిపోయినా నన్ను చూసి 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ భయపడుతోంది. సత్తా.. తాకత్.. అది గుండెల్లో వుంటుంది.. గెలిచే సీట్ల సంఖ్యలో వుండదు..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
‘గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని ఎన్నికల సమయంలో చెప్పాను.. అదే మాటకు కట్టుబడి వున్నాను. సినిమాలు నేను చెయ్యాలి.. ఎందుకంటే, మీలా దోచుకున్న సొమ్ములేవీ నా దగ్గర లేవు…’ అంటూ జనసేనాని పంచ్ డైలాగులు పేల్చారు.