YS Jagan Mohan Reddy: తూచ్.! వైఎస్ జగన్ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు కాదు.!
NQ Staff - September 22, 2022 / 07:35 PM IST

YS Jagan Mohan Reddy: మాట తప్పేది లే… మడమ తిప్పేదే లే.! ఇవన్నీ మాటలకే పరిమితం. చేతల్లో అంతా రివర్స్. సీపీఎస్ రద్దు.. అని మాట ఇవ్వడం, ఆ మాట తప్పడం.! మద్యపాన నిషేధమని చెప్పడం.. తూచ్.. అలా తమ మేనిఫెస్టోలో చెప్పలేని బుకాయించడం.! ఇది కదా వైసీపీ అంటే.!
ఆఖరికి వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి విషయంలో కూడా మాట తప్పుడే.. మడమ తిప్పుడే.! ఇటీవల వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ నిర్ణయం కూడా ప్రకటించేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలతో..

YCP Permanent President Post YS Jagan Mohan Reddy Had Back Down
హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లు నుంచి వైసీపీ సర్కారు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలోనూ కోర్టుల మొట్టికాయలతోనే వెనక్కి తగ్గారు. ఇప్పుడేమో, ఆఖరికి వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి విషయంలో కూడా వైసీపీ అధినేత వెనక్కి తగ్గక తప్పలేదు.
‘అబ్బే, వైఎస్ జగన్ ఆ నిర్ణయాన్ని తిరస్కరించారు.. ఐదేళ్ళ వరకు వైఎస్ జగన్ అధ్యక్షుడిగా వుంటారు. ఆ తర్వాత ఎన్నిక జరుగుతుంది.. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్‌కి తెలియజేశాం..’ అని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదేం పద్ధతి.? ఇదంతే, ఇది వైసీపీ పద్ధతి.!