YSRCP: ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిన వైస్సార్సీపీ.. భయాందోళనలో టీడీపీ

tdp ycp
tdp ycp

YSRCP అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కొని ప్రతిపక్షాలను బలహీనం చేయటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. గతంలో కంటే ఈ ధోరణి ఈ మధ్య కాలంలో కొంచం ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుండి దాదాపు 20 మందికిపైగా ఎమ్మెల్యే లను లాక్కొని ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనీ చూసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఆ అవకాశం ఆ పార్టీకి చిక్కింది. దీనితో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.

tdp ycp

అయితే ఈ ఆకర్షణలు వలన ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో సీఎం జగన్ చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. గతంలో కొందరు టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు రావటానికి సిద్ధంగా ఉన్న కానీ జగన్ తొందరపడలేదు. కారణం ఎక్కడైనా ప్రజా వ్యతిరేకత వస్తుందేమో అని భయం ఉండటం వలన. అయితే తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ పల్లెలో దాదాపు 80 శాతం విజయాలు సాధించటంతో పల్లె ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు అనేది తేలిపోయింది.

ఈ పంచాయితీ ఎన్నికలు ఇచ్చిన ధైర్యంతో మరి కొద్దీ రోజుల్లో ఆపరేషన్ ఆకర్షను మొదలెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే మున్సిపల్ మరియు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మరిన్ని విజయాలు సాధించాలంటే మరికొందరు టీడీపీ నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలనే ఆలోచన అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. జగన్ సీఎం అయ్యి దాదాపు రెండేళ్లు అవుతున్న కానీ పెద్దగా వ్యతిరేకత రాకపోవటంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఇక టీడీపీని నమ్ముకుంటే లాభం లేదని ఇప్పటికే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ కి వెళ్లిపోయారు. మరికొందరు అదే పనిలో ఉన్నారు. దీనితో వైసీపీ పని మరింత తేలిక అవుతుంది. అయితే ప్రధమ శ్రేణి నేతలెవరూ ఇప్పటివరకు వైసీపీ లోకి వెళ్ళటానికి సిద్దమనే సంకేతాలు ఇవ్వలేదు. ఒక వేళా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెడితే వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు .

Advertisement