విజయసాయి దెబ్బకు లబోదిబోమంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

vijayasai padayatra
vijayasai padayatra

విశాఖ ఉక్కును పరిరక్షించుకోవటానికి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్ర చేయటం జరిగింది. దీనికి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్య లోనే హాజరై దానిని చాలా వరకు విజయవంతం చేయటం జరిగింది. అయితే ఈ సభకు వచ్చిన వైసీపీ శ్రేణులు వాళ్లకై వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుండి సొంత డబ్బులు పెట్టి పార్టీ శ్రేణులను తరలించటం జరిగింది.

vijayasai padayatra

దాంతో లోకల్ లీడర్లు లోకల్ జనాల భోజనాలు ఇతరత్రా ఖర్చు పెట్టుకుని బస్ లు నింపి పాదయాత్రకు జనాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. విశాఖ మేయర్ ను కార్పొరేటర్లను గెల్చుకోవాల్సిన బాధ్యత, భారం విజయసాయి మీద వుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ కోటాకు తగ్గట్లు జనాలను తరలించాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ఎమ్మెల్యే పదుల కొద్దీ బస్సులు, వాహనాలు ఏర్పాటుచేసారు. ప్రతి గ్రామానికి ఓ బస్ కేటాయించారు. కనీసం ముఫై మందిని తీసుకురావాలని పార్టీ లోకల్ లీడర్లకు టార్గెట్ పెట్టారు.

నిజానికి విశాఖ మేయర్ ఎన్నికల్లో వైసీపీదే విజయమని ముందు అనుకున్నారు, కానీ అనుకోకుండా ఉక్కు ఫ్యాక్టరీ సమస్య రావటంతో అది కొంచం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ప్రతిపక్షాలు అన్ని కలిసి వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వలనే విశాఖ ఉక్కు కు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నాయి. దీనితో విశాఖలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

దానిని తట్టుకొని విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఇలాంటి పాదయాత్రలు అవసరమని భావించిన విజయసాయి రెడ్డి అధిష్టానంతో మాట్లాడి తానే స్వయంగా పాదయాత్ర చేయటం జరిగింది. దీని కోసం సర్వ శక్తులు ఒడ్డి భారీ స్థాయిలో జన సమీకరణ చేసి ఈ పాదయాత్రను విజయవంతం చేశారు , ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన పాదయాత్ర మీద టీడీపీ జనాలు గుర్రుగా ఉన్నారు.

Advertisement