మహిళా వాలంటీర్ కు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు కాల్… సంచలనంగా మారిన ఆడియో రికార్డు

మొన్న జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలోనే విజయాలు సాధించింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఊహించని విధంగా విజయాలు అందుకున్నారు. అయితే తెలుగుదేశం సానుభూతి పరులు గెలిచిన చోట్ల అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లకు ఇబ్బందికరమైన పరిస్థితిలు వచ్చాయి.

tlari venkatarao

మొదటి నుండి కూడా వాలంటీర్లను అడ్డుపెట్టుకొని వైసీపీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందనే మాటలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా బయటకు వచ్చిన ఒక ఆడియో రికార్డు దానికి బలం చేకూర్చే విధంగా ఉంది, ద్వారకా తిరుమల మండలం రాజుపాలెం వాలంటరీగా పనిచేస్తున్నారు కంకిపాటి అన్నామణి.. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజుపాలెం పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఈ క్రమంలోనే వలంటీర్ అన్నామణి టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేశారని కొందరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.

Advertisement
Advertisement