Minister Roja : మంత్రి రోజాకి నిరసన సెగ.! ఇదెక్కడి పంచాయితీ.!
NQ Staff - July 16, 2022 / 12:25 PM IST

Minister Roja : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజుకో రీతిన ప్రజల నుంచీ, సొంత పార్టీ నేతల నుంచీ, కార్యకర్తల నుంచీ నిరసనను ఎదుర్కోవాల్సి వస్తోంది. గడప గడపకీ మన ప్రభుత్వం.. అంటూ ప్రతిష్టాత్మకంగా వైసీపీ ఓ కార్యక్రమం చేపడితే, తమ గడప వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీస్తున్న వైనం చూస్తున్నాం.
చాలా చోట్ల సొంత పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు, జనం వద్దకు వెళ్ళడానికి కొంత సంకోచిస్తున్నారు.
మంత్రి రోజాకి, సొంత పార్టీలోనే నిరసన సెగ…

YCP Leaders Protested Against Minister Roja
సొంత నియోజకవర్గం నగిరిలోని వడగమాలపేట మండలి బుట్టిరెడ్డి కండ్రిగలో చేప్టిన రహదారుల నిర్మణానికి సంబంధించిన బిల్లుల విషయమై మంత్రి రోజానే నిలదీసేశారు వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్, ఆయన భార్య.
పార్టీని నమ్ముకుంటే తమను అప్పుల పాలు చేశారనీ, చేసిన పనులకు బిల్లులు రాక తమ జీవితాలు నాశమైపోయాయంటూ మంత్రి రోజాని నిలదీశారు వైసీపీ నేతలు. దాంతో, వారికి ఏం సమాధానం చెప్పాలో మంత్రి రోజాకి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని వ్యవహారంలో, న్యాయస్థానం పలు సందర్భాల్లో అధికారులకూ అల్టిమేటం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.