ఇదేంటి ఇలా చేశారు : జగన్ కి ఈ న్యూస్ తెలిస్తే అసలు తట్టుకోగలడా ?

ఏపీలో జగన్ సర్కార్ పై అనేక ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష టీడీపీ పార్టీ. అయితే వైసీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతిలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అయితే కడప జిల్లాలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు దారుణంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, తమ అనుచరులు రెచ్చిపోతున్నారట. ఇష్టం వచ్చినట్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది.

ap cm ys jagan neglecting rayalaseema politics

అయితే వైఎస్ఆర్ సొంత జిల్లా కావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అధికార పార్టీ చెబుతుంది. ఉక్కు ఫ్యాక్టరీని కడుతున్నామని, అలాగే పులివెందుల ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని చేబుతుంది. ఇక ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటేనే మరోవైపు కబ్జాలు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కబ్జాలకు పాల్పడే నాయకులంతా జగన్ కు దగ్గరి బంధువవులే అని తెలుస్తుంది. అయితే సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, వారి భూములను లాక్కుంటున్నారట.

కొందరు అయితే ఏకంగా అడవులను కూడా వదిలిపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఫారెస్ట్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కబ్జాలకు అంతులేకుండా పోతుంది. ఇక భూములు ఇవ్వని వారిని భౌతికంగా కూడా దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ కబ్జాల విషయం సీఎం జగన్ కు తెలిసే చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ కబ్జాల విషయం జగన్ కు తెలిస్తే తట్టుకోగలడా అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చలు జరుగుతున్నాయి.

Advertisement