Amravati : అమ్మకానికి అమరావతి.! శాసన రాజధాని అభివృద్ధి అంటే ఇదేనా.?

NQ Staff - June 26, 2022 / 08:29 PM IST

Amravati : అమ్మకానికి అమరావతి.! శాసన రాజధాని అభివృద్ధి అంటే ఇదేనా.?

Amravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు అధికార వైసీపీ స్పష్టంగా సమాధానం చెప్పడంలేదు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తే, అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలిపింది. అయితే, అధికారంలోకి వచ్చాక, గత మూడేళ్ళుగా అమరావతి అభివృద్ధి పట్ల వైసీపీ సర్కారు చిత్తశుద్ధి చూపలేదు. ఒకటి కాదు, మూడు రాజధానులంటూ వింత వాదననకు వైసీపీ తెరలేపింది.

అప్పటినుంచి, అమరావతి మరింతగా అయోమయంలో పడింది. మూడు రాజధానుల బిల్లు చుట్టూ చాలా రచ్చ జరిగి, చివరకు అది చట్టంగా మారినా, దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు వైసీపీ సర్కారుకి. ఆ తర్వాత సైతం అమరావతి విషయంలో వైసీపీ సర్కారు ముందడుగు వేయలేదు.

అమ్మకానికి అమరావతి..

YCP Government Prepared Sale of Land in Amravati

YCP Government Prepared Sale of Land in Amravati

తాజాగా, వైసీపీ సర్కారు అమరావతిలో భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. వేలం ద్వారా కోట్లాది రూపాయల సొమ్ముని, ప్రభుత్వ ఖజానాలో వేసుకోవాలన్నది వైసీపీ సర్కారు యోచన. ఇంకోపక్క, ఇప్పటికే నిర్మాణంలో వున్న ఓ భవన సముదాయాన్ని లీజుకు ఇవ్వాలని వైసీపీ సర్కారు భావిస్తోంది.

రాజధాని అమరావతిలో గ్రూప్-డి ఉద్యోగుల కోసం ఈ భవన సముదాయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించతలపెట్టింది. 50 శాతానికి పైగా ఈ భవనాల నిర్మాణ పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయి. అందులోని ఓ టవర్‌లో 120 ఫ్లాట్లను లీజుకి ఇచ్చి ఆదాయం ఆర్జించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన అట. ఈ విషయమై ఇప్పటికే సీఆర్డీయే ప్రతిపాదనలు సిద్ధం చేసిందట.
ఏడాదికి 8 నుంచి 10 కోట్ల వరకు లీజు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచించగా, ఈ మొత్తం వ్యవహారంపై రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us