Balakrishna: బాలయ్యను ఆ విషయంలో గట్టిదెబ్బ కొట్టిన జగన్

jagan and balayya
jagan and balayya

Balakrishna 2019 ఎన్నికల్లో రాష్ట్రము మొత్తం మీద వైసీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిన కానీ, దానిని తట్టుకొని నిలబడి తెలుగుదేశం తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అతి తక్కువ మంది, అందులో ఒకరు సినీ హీరో నందమూరి బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆయన మంచి మెజారిటీతో విజయం సాధించాడు. దీనితో హిందూపురం లో మరోసారి నందమూరి పట్టు, తెలుగుదేశం హవా గట్టిగానే ఉందని నిరూపించాడు.

balakrishna

అయితే తాజాగా జరుగుతున్నా పంచాయితీ ఎన్నికల్లో హిందూపురంలో ఊహించని ఫలితాలు వచ్చాయి. బాలయ్య అడ్డాగా చెప్పుకునే హిందూపురం 38 స్థానాల్లో 30 చోట్ల వైసీపీ మద్దతు దారులు ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన బాలకృష్ణ గ్లామర్ ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. నిజానికి ఈ ఎన్నికలను బాలకృష్ణ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని తెలుస్తుంది.

పైగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం ఎదో చుట్టపుచూపుగా వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతాడు తప్పితే, స్థానిక నేతలతో పెద్దగా కలిసి పనిచేసినట్లు ఎక్కడ కనిపించదు. పైగా పంచాయితీ ఎన్నికలు అంటే గ్రామాల్లోని ఛోటా మోటా నేతలదే హవా ఉంటుంది. అలాంటి నేతలకు బాలయ్యకు మధ్య పెద్దగా సంబంధాలు లేవు. ఇదే సమయంలో వైసీపీ పార్టీ కూడా బాలయ్య నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి ఎన్నికల వ్యూహాలు రచించింది.

టీడీపీకి చెందిన కీలక నేతల సొంత ఇలాకాలో ఓడించటమే పనిగా పెట్టుకొని వైసీపీ ముందుకు సాగింది. అటు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కావచ్చు, బాలయ్య బాబు యొక్క హిందూపురంలో కావచ్చు, వైసీపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్ళింది. తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతల నియోజక వర్గాలలో వైసీపీ పాగా వేసింది.మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి, ఆయన సొంత పంచాయతీ అయిన రొద్దం లో టీడీపీ ఓటమి పాలు అయింది. పెనుకొండ లోని మొత్తం 80 స్థానాల్లో 71 వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు.

Advertisement