Varaprasad : వ్యాక్సిన్లపై చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన శాంతా బయోటిక్ ఫౌండర్.!
NQ Staff - December 23, 2022 / 09:58 AM IST

Varaprasad : కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది తానేనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల చెప్పుకొచ్చి అభాసుపాలైన సంగతి తెలిసిందే.
అసలు వ్యాక్సిన్ల తయారీ విషయమై చంద్రబాబు ఆలోచనలు ఎలా వుంటాయి.? ఆయన మనస్త్తత్వమెలా వుంటుంది.? ఈ విషయమై శాంతా బయోటెక్ సంస్థ ఫౌండర్ వరప్రసాద్ గతంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
శాంతా బయోటెక్.. ఓ సంచలనం..
ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్ తమ సంస్థ తయారు చేయనున్న వ్యాక్సిన్ల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా తమకు సూచించిందనీ, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చేందుకూ నిరాకరించారని శాంతాబయోటెక్ వ్యవస్థపాకుడు వరసప్రాద్ చెప్పుకొచ్చారు.
వన్ టు వన్ మీటింగ్ ఎలాగోలా జరిగితే, ఆ సమయంలో చంద్రబాబు తన వైపు నేరుగా చూడకుండానే ‘నో ఛాన్స్’ అనేశారని, వరప్రసాద్ వెల్లడించారు.
‘ప్రాజెక్ట్ సైజ్ ఎంత.? అని ప్రశ్నించి, ఆ తర్వాత చంద్రబాబు లైట్ తీసుకున్నారు’ అని వరప్రసాద్ చెప్పిన మాటల్ని టీఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.
What does a Vaccine Maker feel about CBN …
Listen to Shanta Biotech’s Founder 👇🏾 pic.twitter.com/6OrVf7qqNm— krishanKTRS (@krishanKTRS) December 22, 2022