CM KCR: కేసీఆర్ తెలివి ఏమిటో మరోసారి రుజువైంది..పక్క వ్యూహం.. అదిరిపోయింది..

CM KCR తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న నేతల్లో రాజకీయ మేధావి ఎవరయ్యా ఖచ్చితంగా కేసీఆర్ అనే చెప్పాలి. ఎత్తులకు పై ఎత్తులు వేసి తనకు నచ్చని వాళ్ళని కిందకు దించటంలో ఆయన్ని మించిన మొనగాడు లేడనే చెప్పాలి. ప్రస్తుతం తెరాస పార్టీలో కీలక నేత దాదాపు 20 ఏళ్ళు కేసీఆర్ తో కలిసి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించటంలో కీలక పాత్ర పోహించిన ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయని చెప్పి, ఉన్నపళంగా తన మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసి బయటకు పంపాడు.

will cm kcr put pressure on centre over corona vaccine

అయితే ఈ తతంగం మొత్తం ఒక ప్లాన్ ప్రకారమే చేశారని తెలుస్తుంది. కానీ ఆ ప్లాన్ ను ఎంతో చాకచక్యంగా అమలుచేసి దాదాపుగా విజయం సాధించాడు కేసీఆర్. ఈటెల కు రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అలాంటి నేతను పార్టీ నుండి తొలిగిస్తే సొంత పార్టీ నుండే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కానీ ధైర్యంగా కేసీఆర్ ఆ పని చేయటం వెనుక అసలా కథ వేరే ఉందని తెలుస్తుంది.

సరిగ్గా నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాలకు ముందు ఈటెల మీద ఆరోపణలు రావటం, అతని మీద విచారణకు ఆదేశించటం, ఆ తర్వాత మంత్రి శాఖను బదిలీచేయటం చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఆ వార్త సునామీని సృష్టించింది. ఆ ప్రభావం తగ్గకముందే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ రావటం అందులో తెరాస ఘన విజయం సాధించటం జరిగింది. దీనితో ఈటెల వ్యవహారం మొదటి రోజు ఉన్నంత ఊపు లేకుండా పోయింది.

ఆ మరుసటి రోజు అంటే నిన్న పురపాలక ఫలితాలు వచ్చాయి. ఫలితాలు తెరాస కు అనుకూలంగా వస్తుండగానే ఈటెలను పూర్తిగా మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది.. నాన్ తెరాస నేతలు ఆ విషయం గురించి ఆలోచించారు కానీ, తెరాస శ్రేణులు మాత్రం వరస విజయాలు సాధించామనే ఉత్సహంతో సంబరాలు చేసుకున్నారు. ఈటెలను పార్టీ నుండి తొలిగిస్తే సొంత పార్టీ నేతల నుండి వచ్చే వ్యతిరేకతను కేసీఆర్ ఎన్నికల ఫలితాలు అడ్డం పెట్టుకొని తెలివిగా తప్పించాడు. ఇంకా చెప్పాలంటే ఈటెల రాజేందర్ ను బయటకు పంపించటానికి ఎన్నికల రిజల్ట్స్ సమయాన్ని గతంలోనే కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..

Advertisement