గ్రేటర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా..? ఆఖరి గంటలో గోల్ మాల్..? వెలుగులో సంచలన నిజాలు

PBN - December 3, 2020 / 12:48 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా..? ఆఖరి గంటలో గోల్ మాల్..? వెలుగులో సంచలన నిజాలు

గ్రేటర్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అందరికి తెలిసిన విషయమే, ఈ ఎన్నికల్లో 46. 55 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో కంటే 0. 30 శాతం ఎక్కువ అనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో ఒక రకంగా ఇదే అత్యధికం. మరోవైపు వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. వరుస సెలవులు.. అన్నింటికీ మించి.. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని మున్సిపల్ ఎన్నిక., అయినప్పటికీ.. ఓటర్లు… 46 శాతానికిపైగా ఓట్లేశారంటే.. మరీ తీసి కట్టేం కాదనేది నిపుణుల విశ్లేషణ.

ghmc elections

పెరిగిన ఓటింగ్ శాతం మీదే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి గంట గంటకు ఓటింగ్ పర్శంటేజ్ ప్రకటిస్తూ వచ్చారు.ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటింగ్ సరళి చాలా మందకొడిగా సాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 35 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా తేల్చారు. కానీ చివరి గతంలో ఏకంగా 10 శాతం పోలింగ్ పెరగటం అందరిని షాక్ కుగురిచేసింది. ఐదు గంటల తర్వాత ఏ పోలింగ్ బూత్‌లోనూ ఓటర్లు కనిపించలేదు. సాధారణంగా ఆరు గంటలకుకూడా క్యూలైన్లు ఉంటే… పోలింగ్ శాతం పెరుగుతుందని అనుకోవచ్చు. కానీ.. గ్రేటర్‌లో అసలు ఎక్కడా ఎలాంటి క్యూలే కనిపించలేదు. దాంతో ఏకంగా పది శాతం పోలింగ్ ఎలా జరుగుతుందనేది చాలా మందికి అర్థం కావడం లేదు.

ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లోఈవీఎంలు ఉపయోగించలేదు. బ్యాలెట్లు మాత్రమే వాడారు. ఈవీఎంలు అయితే.. రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ బ్యాలెట్లు అయితే.. చివరి గంటలో పోలింగ్ సిబ్బంది సాయంతో.. ఏజెంట్లు చేసుకోవాలన్నది చేసుకోవచ్చు. ఎన్ని ఓట్లు ఉంటే.. అన్ని గుద్దేసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి.. ఓటర్లు ఓట్లు వేశారని రాసుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుండి జరిగిన ఓటింగ్ సరళిని గమనిస్తే కనీసం 40 శాతం కూడా పూర్తి కాదేమో అనుకున్నారు, కానీ దాదాపు 46 శాతం అంటే మాములు విషయం కాదు.

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న నిపుణులు సైతం ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఆరు తర్వాత లైన్ లో ఉన్నవాళ్ళకి అవకాశం కల్పించటంతో ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుతున్నారు, నిజానికి అసలే చలి కాలం ఈ సమయంలో రాత్రి పూట నిలబడి మరి ఓట్లు వేసేవాళ్ళు సంఖ్య చాలా తక్కువ. పైగా ఉదయం నుండి పోలింగ్ సెంటర్ లు ఖాళీగానే దర్శనం ఇచ్చాయి తప్ప ఎక్కడ కూడా భారీ లైన్ లు కనిపించలేదు. కానీ సాయంత్రనికి మాత్రం ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. అయితే ఆ ఓట్లు ప్రజలు వేసినవి కాదనే వాదన రాజకీయ పార్టీల్లో కూడా వ్యక్తం అవుతుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us