Vote-Note : విచారణ పూర్తయింది.. ఇక శిక్ష వేయటమే మిగిలింది..

Vote-Note: ఆరేళ్ల కిందటి వోటుకు నోటు కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. పోలీసుల దర్యాప్తు-కోర్టు విచారణలు పూర్తయ్యాయి. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్-ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చింది. అతనితోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్ పేర్లను కూడా నమోదు చేసింది. 2015లో శాసన మండలి ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి విజయం కోసం వీళ్లంతా కుట్ర పన్నారని పేర్కొంది.

Vote-Note

రేవంత్ రెడ్డికి ఖాయం..

ఈ కేసులో నంబర్-1 నిందితుడిగా కనిపిస్తున్నది రేవంత్ రెడ్డే. స్టింగ్ ఆపరేషన్ లో ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. నామినేటెడ్ శాసన సభ్యుడు స్టీఫెన్ సన్ కి డబ్బులిచ్చి అతని ఓటు కొనటానికి ప్రయత్నించినట్లు, అందులో భాగంగా కొంత మొత్తాన్ని రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇస్తున్నట్లు సంబంధిత వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మనీలాండరింగ్ కి పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. ఏసీబీ ఛార్జ్ షీట్ ను బేస్ చేసుకొని విచారణ చేపట్టిన ఈడీ.. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ ఇరుక్కుపోయిన రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని న్యాయ శాస్త్ర విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

Vote-Note

చంద్రబాబు పేరు ఉందా?.. లేదా?..

ఈ ఛార్జిషీటులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరు ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ రావట్లేదు. ఎల్లో మీడియాయేమో చంద్రబాబు పేరు ఈ అభియోగపత్రంలో లేదని పేర్కొనగా వైఎస్సార్సీపీ అనుకూల మీడియాయేమో ఉందని చెబుతోంది. దీంతో గందరగోళం నెలకొంది. అసలైతే ఈ నేరంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’’ అంటూ ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లు క్లియర్ గా వినిపిస్తోంది. ఆ మాటలు చంద్రబాబువేనని ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్ సైతం నిర్ధారించింది. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.