Vijaya Sai Reddy : వైస్ కుటుంబం తర్వాత ఆ రికార్డు సాధిస్తున్న విజయ సాయి రెడ్డి..ఇదంతా దేని కోసం .?

vijaya sai reddy

Vijaya Sai Reddy : (విజయ సాయి రెడ్డి) : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతోంది. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కార్మికులంతా కలిసి జేఏసీగా ఏర్పడి దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఉక్కు మా హక్కు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్ర చేపట్టారు. విశాఖ జీవీఎంసీ విగ్రహం నుంచి ప్రారంభమైన యాత్ర స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం మెయిన్ గేట్ వరకు సాగింది. దాదాపు 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేయకూడదనే వైసీపీ విధివిధానాలను అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకుని ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. పోరాటాన్ని కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

పాదయాత్ర ఇవాళ కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ..2003 ఏప్రిల్ 9న చేవెళ్లలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించారు.. మొత్తం 68రోజుల పాటు 1470 కిలోమీటర్లు నడిచారు. తర్వాత అధిక మెజారిటీతో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి

2012లో వైఎస్ కూతురు షర్మిల కూడా ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసింది. అక్టోబర్ 18 ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై.. మొత్తం 230 రోజుల పాటు 14 జిల్లాల్లో 3112 కిలోమీటర్లు నడక సాగించింది.

అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2017 నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించి.. 341 రోజుల పాటు 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ మొత్తం 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ ప్రజా సంకల్ప యాత్రే జగన్ మోహన్ రెడ్డిని ఏపీకి ముఖ్యమంత్రిని చేసింది. ఇలా పాదయాత్రలు చేసిన వాళ్లు చరిత్రలో ఓడిపోయిన దాఖలలు లేవు.

Advertisement