Varla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం
NQ Staff - January 22, 2023 / 05:26 PM IST

Varla Ramaiah : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీకు నుండి యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించబోతున్న విషయం తెలిసింది. కొన్ని వారాల క్రితమే తెలుగు దేశం పార్టీ ఈ పాదయాత్ర కోసం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అనుమతులు కోరుతూ లేఖ రాయడం జరిగింది.
ఆ లేఖ పై డీజీపీ కార్యలయం స్పందించక పోవడంతో మరోసారి వర్ల రామయ్య డీజీపీ కార్యాలయం కి రిమైండర్ లేక పంపించారు. తాజాగా బిజెపి కార్యాలయం లోకేష్ పాదయాత్ర అనుమతికి సంబంధించి స్పందించింది.
పాదయాత్రలో ఎంత మంది పాల్గొనబోతున్నారు.. రూట్ మ్యాప్ ఏంటి, ముఖ్య నేతలు ఎవరు పాల్గొంటారు, వీఐపీలు ఎవరు పాల్గొంటారు అనే విషయాలను తెలియజేయాలంటూ ఆదేశించింది.
డీజీపీ కార్యాలయం ఇచ్చిన ఆదేశాలపై వర్ల రామయ్య స్పందిస్తూ.. జగన్ పాలనతో విసుగెత్తిన ప్రతి ఒక్కరూ లోకేష్ వెంట నడుస్తారని.. అలా లోకేష్ వెంట ఎంత మంది వస్తారు ముందు ఎలా చెప్పగలమని పేర్కొన్నారు.
లోకేష్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీ ది అని… ఒకవేళ పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వక పోయినా పాదయాత్ర మాత్రం ఆగదని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పాదయాత్ర వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.