CM Jagan: బయటకు రాబోతున్న జగన్.. ఆందోళనలో కీలక నేతలు

CM Jagan ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరికొద్ది రోజుల్లో బయటకు రాబోతున్నాడు. బయటకు అంటే ప్రజల మధ్యలోకి, సీఎం అయిన తొలి ఏడాది పాలనపై దృష్టిపెట్టిన జగన్ కు తర్వాత కరోనా వైరస్ తో మరో ఏడాది మొత్తం పర్యటనలకు బ్రేక్ పడిందని చెబుతారు. దీంతో జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. గడిచిన 20 నెలల్లో జగన్ పెద్దగా జిల్లాల్లో పర్యటించింది లేదు.

cm jagan ap

మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్ రాలేదు. దీనితో ప్రజలకు జగన్ కు మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు దానిని పూరించడానికి మరికొద్ది రోజుల్లో జిల్లా పర్యటనలు చేయటానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. దీని కోసమే కాబోలు రహదారుల కోసం దాదాపు 2 వేల కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే జగన్ పర్యటన పట్ల ప్రజల కంటే కూడా ఆ పార్టీ నేతలే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వారీగా వైసీపీ పార్టీలో వర్గ పోరు కనిపిస్తుంది. జూనియర్ మంత్రులకు, సీనియర్ ఎమ్మెల్యే లకు మధ్య పొసగటం లేదు. దీనితో వర్గ రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు జగన్ పర్యటనలు వలన అవి కొంచమైనా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తమ నియోజకవర్గంలోని దీర్ఘకాలక సమస్యలపై కూడా జగన్ స్పందించే అవకాశముండటంతో జిల్లా నేతలందరూ జగన్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

ఇదే సమయాల్లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంత వరకు ప్రజలకు చేరాయి అనే విషయంపై కూడా సీఎం ఆరా తీసి, స్వయంగా ప్రజల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దీనితో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు సంక్షేమ పధకాల ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పనిచేయటం మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ పర్యటనల తర్వాత మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించి తదుపరి మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement