గుంటూరు బిటెక్ విద్యార్థుని వేధింపులపై ట్విస్టుల మీద ట్విస్టులు …!

Advertisement

ప్రస్తుత రోజుల్లో చదువుకున్న యువకులు సైతం కనీసం మానవత్వం లేకుండా గూండాల్లా తయారవుతున్నారు.కొంతమంది యువత మద్యానికి బానిసైతే, మరికొందరికి కామం తో కళ్లు మూసుకుపోతున్నాయి ఇంకొందరైతే డబ్బు ఆశకు అఘాయిత్యాలు చేసి తప్పుదారిలో వెళ్తున్నారు. విద్యార్థులు అన్న మాటే మరిచిపోతున్నారు. చదువుకొని ప్రయోజకులు అవ్వాలని తల్లి దండ్రులు ఉత్తమ చదువులు చదివిపిస్తే కొంతమంది ఇలా కిరాతకంగా తయారవుతున్నారు.ఇలాంటి కిరాతక విద్యార్థులు చేతిలో ఓ యువతీ కుటుంబం మూడు సంవత్సరాలుగా నరకయాతన అనుభవించింది.

ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు పట్టణానికి చెందిన ఇరువై సంవత్సరాల ఒక యువతీ మూడేళ్ళ క్రితం వరుణ్ అనే ఓ యువకుడికి పరిచయం అయ్యింది.వీళ్లిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.అయితే వరుణ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంటికి ఆ యువతిని పిలిచి చదువుకుందాం అని చెప్పాడు. దానికి అంగీకరించిన యువతీ సదరు ఆ యువకుడి ఇంటికి వచ్చింది. ఈ అవకాశాన్ని కాస్త ఉపయోగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసాడు వరుణ్. మత్తు మందు కలిపినా కూల్ డ్రింక్ ను ఆ యువతికి ఇచ్చాడు. అది తాగిన ఆ యువతీ మత్తులోకి వెళ్ళిపోయింది. ఆలా మత్తులో ఉన్న యువతిని నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి తన కామవాంచ తీసుకున్నాడు వరుణ్. అయితే తన దగ్గర ఉన్న ఆ నగ్న ఫోటోలను, వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు వరుణ్.. వరుణ్ ఇలాంటి వాడు అని తెలుసుకున్న యువతీ అతడికి దూరం ఉండడం మొదలు పెట్టింది.

ఇది ఇలా ఉండగా ఆ యువతీ ఉన్నత చదువులకోసం ఇంజనీరింగ్ కళాశాలలో చేరింది. ఆ కళాశాలలో కౌశిక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆ యువతికి…. వీళ్లిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరోజు ఆ యువతిని నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. దినీతో కౌశిక్ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చూసి ఎలాంటిదో తెలుసుకున్నారు. కౌశిక్ స్నేహితులు వరుణ్ తీసిన నగ్న వీడియోలను వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాడు.ఆ వీడియోలు చుసిన కౌశిక్ ఆ యువతికి దూరం అయిపోయాడు. అయితే ఆ యువతీ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానించడు కౌశిక్…. అది తెలుసుకున్న కౌశిక్ తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టాడు. అంతేకాకుండా ఆ యువతిని డబ్బు ఇవ్వాలని బెదిరించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు వరుణ్, కౌశిక్ కుటుంబాలకు చెప్పగా వాళ్ళు ఆ వీడియోలను ఇంటర్నెట్ నుండి తీసేసారు. మల్లి ఈ మధ్య ఆ వీడియోలను చుసిన ఆ యువతీ వరుణ్, కౌశిక్ ల మీద విసుగు వచ్చి పోలీసులను ఆశ్రయించింది.మొత్తానికి పోలీసులు ఆరా తీసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేసారు.అందుకే తల్లిదండ్రులు మీ పిల్లల మీద ఓ కనెయ్యండి. ఇలాంటి సంఘటనలు జరగక ముందే జాగ్రత్త పడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here