Koosukuntla Prabhakar Reddy : మునుగోడు బై పోల్: గులాబీ శ్రేణులు వద్దంటున్నా.. ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థి.!

NQ Staff - October 7, 2022 / 03:29 PM IST

Koosukuntla Prabhakar Reddy : మునుగోడు బై పోల్: గులాబీ శ్రేణులు వద్దంటున్నా.. ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థి.!

Koosukuntla Prabhakar Reddy : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. గులాబీ పార్టీ నేత.! గులాబీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తి.! ఆయనే మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి.

సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకీ అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ముగ్గురు అభ్యర్థులు.. ముక్కోణపు పోటీ..

కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి దిగుతున్నారు. ఒకరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే.. మిగతా ఇద్దరూ ఎలాగైనా ఆ స్థానాన్ని గెలిచేందుకు పట్టుదలతో వున్నోళ్ళు.. వెరసి మునుగోడులో త్రిముఖ పోటీ గట్టిగానే వుండబోతోంది.

అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీనే ముందు మొదలెట్టింది. ఏం లాభం.? పోటీ మాత్రం బీజేపీ – టీఆర్ఎస్ మధ్యనే.. అన్నట్లుంది పరిస్థితి.

కాగా, అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ తెలంగాణ రాష్ట్ర సమితికి వున్నా, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ చేస్తోన్న ఈ రిస్క్.. ఆ పార్టీని ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us