పంచాయతీ ఎలక్షన్ కంటే జగన్ కి ఇది చాలా ఇంపార్టెంట్, తేడా వస్తే ఇంతే సంగతులు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా లోకల్ బాడీ ఎన్నికలు అధికార వైసీపీకి ఎంతో కీలకమనే చెప్పాలి. ఎన్నికల విషయానికి వస్తే రాష్టంలోని 11 జిల్లాలు ఒక ఎత్తు గోదావరి జిల్లాలు మరో ఎత్తు, ఆ రెండు జిల్లాలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ముందంజలో ఉంటుంది. గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఈ రెండు జిల్లాలోను ఘోర ఓటమిని మూటకట్టుకొని అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

jagan

ఇక పంచాయితీ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా ఈ జిల్లాల్లో పై చెయ్యి సాధించాలని చూస్తున్నారు. 2019 ఓటమి తర్వాత టీడీపీ అక్కడ కాస్త పుంజుకుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. రాజధాని ఉద్యమం వలన గోదావరి జిల్లాల్లో టీడీపీ ఉనికి బలపడిందని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ కి గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి.

ఇదే సమయంలో వైసీపీ జనాలు కూడా సాధ్యమైనంత వరకు పంచాయితీలను తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే జగన్ సర్కార్ మూడు రాజధానులు అంటూ ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. మరి దాని మీద జనాభిప్రాయం ఎలా ఉందో లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుంది అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రవాసులు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదని టీడీపీ తమ్ముళ్ళు గట్టిగా ఊదరగొడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ద్వారా అది రుజువు చేస్తారని కూడా వారు అంటున్నారు. దీంతో ఎలాగైనా వైసీపీని ఆ మూడు జిల్లాల్లో ఓడించాలంటూ చంద్రబాబు నుంచి తమ్ముళ్ళకు గట్టిగానే ఆదేశాలు వెళ్లాయి. ఒకసారి కనుక వైసీపీ ఓడితే ఇక రాజధాని ప్రసక్తి ఉండదని కూడా అంటున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవటమే కాదు, ఆయా జిల్లాలో టీడీపీ కి ప్రజాదరణ లేదని కూడా నిరూపించాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీద ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక టీడీపీ తలెత్తుకుని నిలబడితే రేపటి రోజున జగన్ కలల రాజధాని విశాఖకే గండి పడుతుంది అని కూడా వైసీపీలో ఆందోళన రేగుతోంది. దాంతో పాటు వైసీపీకి కూడా పై నుంచి బాగానే ఆదేశాలు వచ్చాయి. మూడు జిల్లాల్లో ఫ్యాన్ గిర్రున తిరగాల్సిందే అంటున్నారు.

Advertisement