Venu Swamy : 2024లోను జగన్ సీఎం కావడం పక్కా అని బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి
NQ Staff - July 18, 2022 / 03:20 PM IST

Venu Swamy : సమంత-నాగ చైతన్య విడాకుల ఇష్యూని తన వైపుకి తిప్పుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ సినీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెప్తూ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్‌గా మారిన ఈయన తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీఎం జగనే..
వేణు స్వామి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జగన్ సీఎం కావడం పక్కా అని చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం 2024లో జగన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. రేపు పొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు, ఎలా జరుగుతుందనే దానిని బట్టి సీఎం గురించి మాట్లాడుదాం అని వేణు స్వామి స్పష్టం చేశారు.

There Chance YS Jagan Becoming CM in 2024 Venu Swamy
పనిలో పనిగా తెలంగాణ పరిస్థితి గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. 2023 జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు జరగబోతున్నాయి. టీఆర్ఎస్‌ని మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం ఇదే వేణు స్వామి.. జగన్ గురించి మాట్లాడుతూ.. జగన్ గారి జాతకం ప్రకారం ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలి.. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరు. 2019లో జగన్ గారికి జాతకపరంగా స్టార్ట్ అయిన ఫేజ్.. 2022 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుంది.

There Chance YS Jagan Becoming CM in 2024 Venu Swamy
అంటే.. 2022 ఏప్రిల్ 2 నుంచి రాజకీయంగా చాలా రాష్ట్రాలలో రాజకీయపరమైన మార్పులు వస్తున్నాయి. అందులో ఏపీ ఉంది.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఏపీకి తేడా ఏంటి అంటే.. జగన్ మోహన్ రెడ్డి పాజిటివ్ వైపు వెళ్తున్నారు.. మిగిలిన వాళ్లు నెగిటివ్ వైపు వెళ్తున్నారు అంటూ పలు సంచలన కామెంట్స్ చేశారు.